Rakul Preet Singh: ఆ పదం సరైనదో కాదో తెలియదు

ABN , Publish Date - Aug 18 , 2024 | 09:57 AM

పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అద్భుతమైన కథానాయకులతో పని చేయడం తర అదృష్టం అంటున్నారు రకుల్‌ప్రీత్  సింగ్‌.  ఉత్తారాది, దక్షిణాది చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించింది.

పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అద్భుతమైన కథానాయకులతో పని చేయడం తర అదృష్టం అంటున్నారు రకుల్‌ప్రీత్  సింగ్‌ (Rakul Preet Singh).  ఉత్తారాది, దక్షిణాది చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించింది. ఇటీవల వివాహబంధం లో అడుగుపెట్టిన ఆమె అటు వ్యక్తిగత జీవితాన్ని, ఇటు వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తుంది. తాజాగా భారతీయుడు -2 (Indian2)చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రకుల్‌. తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన కథానాయకులతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు వచ్చిన ఈ గొప్ప అవకాశానికి అదృష్టం అనే పదం సరియైనదో  కాదో తెలియదు. కానీ.. నేను సినీరంగానికి  ఏ సంబంధం లేని అమ్మాయిని  అయినప్పటికీ ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో రుణపడి ఉంటాను.

Rakul-2.jpgతక్కువ కాలంలోనే ఉత్తమమైన అగ్ర కథానాయకులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. భిన్నమైన పరిశ్రమలలో పనిచేస్తూ.. కొత్త కొత్తవారి నుంచి  ఎన్నో విషయాలు నేర్చుకునే మంచి అవకశాం నాకు దేవుడు ఇచ్చాడు. నాకు తెలిసి జీవితంలో ఇలాంటి ఊహించని పరిణామాలకు ఒక ప్రణాళిక అంటూ ఏమీ ఉండదు. కెరీర్‌లో మరో మెట్టు ఎదగడానికి ఇవి తోడ్పతాయని నమ్ముతాను’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఇండియన్ -3, 'దే దే ప్యార్‌ దే 2' చిత్రాలు ఉన్నాయి. 

Updated Date - Aug 18 , 2024 | 09:57 AM