Rakul preeth singh: రకుల్‌ పెళ్లి.. డేట్‌ ఫిక్స్‌?

ABN , Publish Date - Jan 01 , 2024 | 05:09 PM

ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ రెండేళ్లగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే! ఇప్పటికే వీళ్ల పెళ్లి పలు రకాల వార్తలొచ్చాయి. అయితే రకుల్‌ సమయం, సందర్భం చూసి పెళ్లి చేసుకుంటానని పలు ఇంటర్వ్యూలో చెప్పింది.

Rakul preeth singh: రకుల్‌ పెళ్లి.. డేట్‌ ఫిక్స్‌?

ఢిల్లీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌(Rakul) బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీ రెండేళ్లగా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే! ఇప్పటికే వీళ్ల పెళ్లి పలు రకాల వార్తలొచ్చాయి. అయితే రకుల్‌ సమయం, సందర్భం చూసి పెళ్లి చేసుకుంటానని పలు ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరగనుందంటూ పలు ఇంగ్లిష్‌ వెబ్‌సైట్స్‌లో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ వివాహం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది. సినీ ప్రముఖులకు ప్రత్యేకంగా విందు ఇవ్వాలనుకుంటుందని కూడా ఆయా వెబ్‌సైట్స్‌ వార్తలు ప్రచురించాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ కావడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దీనిపై రకుల్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. (Rakul marriage date Fix)

Untitled-1.jpg

2013లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగులో తొలి విజయాన్ని అందుకొంది రకుల్‌. ఆ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుసకట్టాయి. అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని క్రేజీ హీరోయినగా గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు కాస్త అవకావాలు సన్నగిల్లాయి. తెలుగులో కొంగ పొలం చిత్రం తర్వాత ఆమె మరో సినిమా అంగీకరించలేదు. బాలీవుడ్‌లో మాత్రం రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ‘అయాలన్‌’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Updated Date - Jan 01 , 2024 | 05:09 PM