Stree2: ఈ సారి ఇంకా గ‌ట్టిగా భ‌య పెడ‌త‌ట్టున్నారే! స్త్రీ2 ట్రైల‌ర్ రిలీజ్‌

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:49 AM

2018లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన హిందీ కామెడీ, హ‌ర్ర‌ర్‌ చిత్రం స్త్రీ. రాజ్ కుమార్ రావు, శ్ర‌ద్ధా క‌పూర్, పంక‌జ్ త్రిపాఠి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ స్త్రీ2 తెర‌కెక్క‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Stree2

2018లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన హిందీ కామెడీ , హ‌ర్ర‌ర్‌ చిత్రం స్త్రీ (Stree). రాజ్ కుమార్ రావు (Rajkummar Rao), శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor), పంక‌జ్ త్రిపాఠి (Pankaj Tripathi) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కేవ‌లం రూ. 25 కోట్ల లోపు వ్య‌యంతో రూపొందిన ఈ చిత్రం రూ.180 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు రాజ్ అండ్ డీకే మ‌రో నిర్మాత దినేశ్ విజ‌న్ (Dinesh Vijan)తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌గా అమ‌ర్ కౌశిక్ (Amar Kaushik) ద‌ర్శ‌కుడిగా ఆరంగేట్రం చేశాడు. ఒక‌ప్పుడు ప‌ల్లెటూర్ల‌లో తలుపుల‌పై ఓ స్త్రీ రేపు రా అని వ్రాయ‌బ‌డిన ఉన్న క‌థా నేప‌థ్యంలో ఈ స్రీ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

Stree2

చందేరి అనే గ్రామంలో ప్ర‌తి సంవ‌త్స‌రం దుర్గామాత ఉత్స‌వాలు 4 రోజులు జ‌రుగుతుంటాయి. ఆ నాలుగు రోజుల్లోనే ఎవ‌రి ఇంటిపైన అయినా ఓ స్త్రీ క‌ల్ అనా అని ర‌క్తంతో వ్రాసి లేకుంటే ఆ ఇంట్లోని మ‌గ‌వాళ్ల‌ను ఓ ఆడ దెయ్యం ఎత్తుకెళుతుంది. ఈ నేప‌థ్యంలో హీరో ఈ స‌మ‌స్య‌లో చిక్కుకున్నాడా , దెయ్యాన్ని ఎదుర్కున్నాడా లేదా అనే పాయింట్‌తో ఔట్ అండ్ ఔట్ కామెడీతో తెర‌కెక్కించారు.

Stree2


Stree2

అయితే ఇప్పుడు ఆరేండ్ల త‌ర్వాత‌ ఈ సినిమాకు సీక్వెల్ స్త్రీ 2(Stree 2)ను తీసుకు వ‌స్తున్నారు. మొద‌టి భాగంలో న‌టించిన న‌టీన‌టులే ఈ మూవీలోనూ న‌టిస్తుండ‌గా మొద‌టి భాగాన్ని డైరెక్ట్‌ చేసిన అమ‌ర్ కౌశిక్ (Amar Kaushik)ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కకుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఆగ‌స్టు 15 న ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

Stree2

ట్రైల‌ర్‌ను చూస్తే మొద‌టి భాగాన్ని మించి ఈ సినిమా ఉంటుంద‌నేది అర్థ‌మ‌వుతోంది. ప్ర‌ధాన తారాగ‌ణం అంతా ట్రైల‌ర్‌లో క‌నిపించ‌గా , దెయ్యం సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. అంతేగాక విజువ‌ల్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. మొద‌టి భాగానికి ఎక్క‌డా త‌గ్గ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక పాట‌లో న‌ర్తించ‌గా బాగానే అందాలు ఆర‌బోసిన‌ట్లు ట్రైల‌ర్‌లో క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి ఈ స్త్రీ 2(Stree 2) సినిమా ఏ రేంజ్ విజ‌యం సాధిస్తుందో, వ‌సూళ్లు సాధిస్తుందో.

thamanna

Updated Date - Jul 19 , 2024 | 11:50 AM

Radhika Apte: ఓటీటీలో బాల‌య్య బ్యూటీ న్యూడ్‌గా న‌టించిన సినిమా! తెలుగులోనూ ట్రెండింగ్‌

Raashii Khanna: చీరను ఇలా కూడా కట్టొచ్చా.. రాశీఖన్నా

Raashii Khanna: జార విడిచి మ‌రి.. అందాల ’రాశి‘ విందు

Priya Banerjee: రానా బ్యూటీ.. కంటెంటు గ్యారెంటీ! 

Ruhani Sharma: ఇదేంద‌య్యా ఇది.. ఎప్పుడు చూడ‌లా! మంట‌లు రేపుతున్న రుహానీ