Pushpa 2: అక్కడ పుష్ప హవా ఏమాత్రం తగ్గలేదు.. ఇప్పుడు ఇంకోలా..

ABN , Publish Date - Dec 24 , 2024 | 02:40 PM

తాజాగా హిందీలో (bollywood) ఈ సినిమా మరో ఘనత సాధించింది. బీటౌన్‌లోనే రూ.700 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

వెండితెరపై పుష్ప (Pushpa 2 in 3D)రూలింగ్‌ ఇంకా తగ్గలేదు. సినిమా విడుదలై రెండు వారాలు కావొస్తున్నా పుష్పరాజ్‌ హవా తగ్గలేదు. కలెక్షన్స్‌ డ్రాప్‌ అవ్వలేదు. అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా హిందీలో (bollywood) ఈ సినిమా మరో ఘనత సాధించింది. బీటౌన్‌లోనే రూ.700 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్‌ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై హిందీ ఆడియన్స్‌ ఈ సినిమాను మరింత ఎంజాయ్‌ చేయనున్నారు. దీని త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. (yashraj films wishesh to pushpa team)

ఈ చిత్రాన్ని మొదట ప్రపంచవ్యాప్తంగా త్రీడీలో విడుదల చేయాలనుకున్నారు.  కొన్ని కారణాల వల్ల అప్పుడు త్రీడీలో విడుదల చేయలేకపోయారు. తాజాగా హిందీ భాషలో త్రీడీ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్ర బృందానికి బాలీవుడ్‌ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అభినందనలు తెలిపింది. అల్లు అర్జున్‌, రష్మిక ఆ పోస్ట్‌కు రిప్లై ఇస్తూ థాంక్స్‌ చెప్పారు. ‘పాత రికార్డులను ఈ చిత్రం బద్దలుకొడుతోంది. ఎన్నో కొత్త రికార్డులు  సృష్టిస్తోంది. చరిత్రను తిరగరాస్తున్నందుకు ‘పుష్ప2’ టీమ్‌కు అబి?నందనలు. ఇది ఫైర్‌ కాదు.. వైల్డ్‌ ఫైర్‌’ అని నిర్మాణసంస్థ పేర్కొంది. మీ అభిమానానికి ధన్యవాదాలు అని అల్లు అర్జున్‌ ఆ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు  

Updated Date - Dec 24 , 2024 | 02:41 PM