Poonam pandey: నిన్నేమో పోయానని.. ఈ రోజేమో బతికే ఉన్నానని.. !
ABN , Publish Date - Feb 03 , 2024 | 12:50 PM
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్‌పాండే వివాదస్పద నాయిక అని మరోసారి రుజువు చేసింది. గర్భశయ క్యాన్సర్‌తో శుక్రవారం ఉదయం మరణించింది అంటూ ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే!
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్‌పాండే వివాదస్పద నాయిక అని మరోసారి రుజువు చేసింది. గర్భశయ క్యాన్సర్‌తో శుక్రవారం ఉదయం మరణించింది అంటూ ఆమె అధికారిక ఇనస్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే! బాలీవుడ్‌కి చెందిన పలువురు కూడా మరణవార్తను ధృవీకరించారు. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో సంచలనం సృష్టించింది. 'నేను బతికే ఉన్నానంటూ’ ఓ వీడియోను ఆమె షేర్ చేసింది. గర్భాశయ క్యాన్సర్ అవగాహన కోసమే ఇలా చేశానని ఆమె వీడియోలో పేర్కొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రోజురోజుకీ ప్రమాదకరంగా మారిందనీ, దానిపై అవగాహన కల్పించేందుకే తన సిబ్బందితో చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానని తెలిపారు.
‘‘మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం పంచుకోవాలనుకుంటున్నా. నేను చనిపోలేదు. బతికే ఉన్నా. గర్భాశయ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోలేదు. కానీ, అది వేలాది మంది మహిళల ప్రాణాలు తీస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఈ వ్యాధి ప్రాణాల్ని హరిస్తోంది. ఇది ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు. దీనిని నివారించడం సాధ్యమే. హెచ్‌పీవీ వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి. అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశా. తప్పని భావిస్తే క్షమించండి’’ అని పూనమ్ పాండే పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు పూనమ్‌పై మండిపడుతున్నారు. అవగాహన అవసరమే కానీ ఈ తరహాలో చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.