Payal Ghosh: 9 ఏళ్లుగా శృంగారంలో పాల్గొనలేదు.. ఎందుకంటే?

ABN , Publish Date - Jun 27 , 2024 | 07:34 PM

బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal ghosh) తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక వివాదం సృష్టిస్తుంటారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.

Payal Ghosh: 9 ఏళ్లుగా శృంగారంలో పాల్గొనలేదు.. ఎందుకంటే?

బాలీవుడ్‌ నటి పాయల్‌ ఘోష్‌ (Payal ghosh) తరచూ సోషల్‌ మీడియాలో ఏదో ఒక వివాదం సృష్టిస్తుంటారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. గతంలో మీటూ ఉద్యమంలో భాగంగా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) తనను లైంగికంగా వేధించాడని కొద్దిరోజులపాటు సోషల్‌ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశం పేరుతో తనను లొంగదీసుకోబోయాడని విమర్శలు చేసింది. అలాగే గతంలో ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో పాస్ట్‌ బౌలర్‌ అయిన ఇర్ఫాన్ పఠాన్ తో ఐదేళ్లు డేటింగ్‌లో ఉన్నానని పేర్కొని మరో సంచలనానికి తెర తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇద్దరికీ బ్రేకప్‌ అయిందని తెలిపింది. తాజాగా మరోసారి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.


Payal.jpg
‘‘ఇర్ఫాన్  కన్నా నాకు చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్‌ ఉంటే ఏంటి? ప్రేమ ఉండాలి కదా? నా తండ్రికి మా రిలేషన్‌ ఇష్టం లేకపోయినా.. నేనెప్పుడు చీట్‌ చేయాలనుకోలేదు. 2016 జనవరి ఫస్ట్‌ సెలబ్రేషన్స్ ఇర్ఫాన్ ఇంట్లో నిర్వహిస్తుంటే నేను కూడా వెళ్లాను. పార్టీ అయ్యి నేను నా ఇంటికి చేరుకునేలోపు ఇర్ఫాన్ కాల్‌ చేసి 'నా తల్లిదండ్రులకు నువ్వు నచ్చలేదు. మన పెళ్ళికి వారు ఒప్పుకోలేదు’ అని చెప్పాడు. అప్పటి నుంచి నన్ను దూరం పెట్టాడు. నా తండ్రికి ముస్లిమ్స్‌ ఇష్టం లేదు. కానీ, నేను ఎప్పుడు అతనికి సపోర్ట్‌గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తరువాత వాళ్ళ చెల్లి నాకు కాల్‌ చేసి ఇర్ఫాన్ కు పెళ్లి కాబోతుంది’ నీ మనసు ఎలా అంగీకరిస్తుంది’ అని ప్రశ్నించింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది? నా హృదయం ముక్కలైంది? నా బాధ ఎవరు అర్థం చేసుకోలేదు. అతనితో బ్రేకప్‌ తర్వాత అనారోగ్యం పాలయ్యాను. కొన్నాళ్లు ఏ పని చేయలేకపోయా. అది జరిగి ఇప్పటికి 9 ఏళ్లు అవుతుంది. పఠాన్ తో బ్రేకప్‌ అయ్యాక నేను మరో వ్యక్తితో శృంగారంలో పాల్గొనలేదు. ఇది వినడానికి నిజం కాకపోవచ్చు అనిపిస్తుంది. కానీ, ఇదే నిజం. ఆ తర్వాత నాతో చాలామంది బడా బాబులు శృంగారం చేయడానికి ట్రై చేశారు. కానీ దాని పట్ల ఒక గౌరవం ఉంది. ఎవరితో పడితే వాళ్లతో అలా చేయలేం’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Payla-2.jpg
 

Updated Date - Jun 27 , 2024 | 07:45 PM