Oscars 2025: లాపతా లేడీస్ 'లాస్ట్' లేడీస్ అయ్యారు.. అయినా 'సంతోషమే'
ABN , Publish Date - Dec 18 , 2024 | 03:37 PM
తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన షార్ట్ లిస్ట్‌లో లాపతా లేడీస్ 'లాస్ట్' అయ్యింది. అయితే మరో ఇండియన్ మూవీ సెలెక్ట్ అయ్యింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..
ఈ సారి అకాడమీ అవార్డ్స్‌లో భారత్ కి భారీ నిరాశ ఎదురైంది. ఎన్నో ఆశలను రేకెత్తిస్తూ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుండి అధికారికంగా నామినేట్ అయినా ‘లాపతా లేడీస్’కి తీవ్ర నిరాశ ఎదురైంది. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) చేసిన షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే ఈ లోటును మరో మూవీ తీర్చింది.
లాపతా లేడీస్ ఆస్కార్స్‌కి నామినేట్ అయ్యాక మూవీ టైటిల్‌ని 'లాస్ట్ లేడీస్'గా మార్చిన విషయం తెలిసిందే. లాస్ట్, లాపతా అంటే మిస్సింగ్ అనే అర్థం ఉంది. వేరే సందర్భంలో లాస్ట్ కి ఓటమి అని అర్థం వస్తుంది. లాపతా లేడీస్ 'లాస్ట్ లేడీస్'గా మారిన తర్వాత ఓటమి చవిచూడటం గమనార్హం. బాలీవుడ్ లెజెండ్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. థియేటర్, ఓటీటీ అనే తేడా లేకుండా ప్యూర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాని ఆస్కార్స్ 2025కి అధికారికంగా పంపించారు. కానీ.. తాజాగా ప్రకటించిన 15 సినిమాలతో కూడుకున్న షార్ట్ లిస్ట్ లో అకాడమీ ఈ సినిమాని కన్సిడర్ చేయలేదు.
లాపతా లేడీస్ నిరాశపరిచిన దాని స్థానంలో మరో హిందీ మూవీ షార్ట్ లిస్ట్ చోటు సంపాదించుకోవడం విశేషంలాపతా లేడీస్ నామినేట్ అయినా కేటగిరీలోనే 'సంతోష్' అనే హిందీ మూవీ షార్ట్ లిస్ట్ అయ్యింది. అయితే ఈ మూవీ యూకే నుండి నామినేట్ కావడం విశేషం. ఈ సినిమాని నార్త్ ఇండియాలోని గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కించారు. ఈ మూవీని సంధ్య సూరి తెరకెక్కించగా షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించింది. దీంతో ఈ మూవీ మేకర్స్ 85 సినిమాల నుంచి తమ మూవీ షార్ట్ లిస్ట్ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని సంబరాలు జరుపుకుంటున్నారు.