Mrunal Thakur: పెళ్లి, పిల్లలు గురించి మృణాల్‌ ఏమన్నారంటే..!

ABN , Publish Date - Apr 26 , 2024 | 02:44 PM

"సీతారామం’ (Sitaramam)ఫేం మృణాల్‌ ఠాకూర్‌ సినిమాలతోపాటు ఓటీటీ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది. ఇటీవల కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన ఆమె మళ్లీ షూటింగ్‌లతో బిజీ కాబోతుంది. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివాహం, పిల్లలను  కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mrunal Thakur: పెళ్లి, పిల్లలు గురించి మృణాల్‌ ఏమన్నారంటే..!
Mrunal Thakur

"సీతారామం’ (Sitaramam)ఫేం మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) సినిమాలతోపాటు ఓటీటీ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది. ఇటీవల కుటుంబ సభ్యులతో కొంత సమయం గడిపిన ఆమె మళ్లీ షూటింగ్‌లతో బిజీ కాబోతుంది. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వివాహం, పిల్లలను  కనడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం ఎంతో అవసరం. దానిని ఎలా సాధించాలని ఆలోచిస్తుంటాం. ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్స్‌ ఎంతో కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే, మన వృత్తిని అర్థం చేసుకునే సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. వర్క్‌ లైఫ్‌లో అలసిపోయిన నన్ను ఆ ట్రాన్స్  నుంచి బయటకు తీసుకువచ్చేది నా సోదరి, నా స్నేహితులే. వాళ్లు అన్ని విధాలుగా నాకు అండగా ఉంటారు’’ అని చెప్పారు.

mrunal-thakur.jpg

అంతే కాదు ‘ఫ్రీజింగ్‌  ఎగ్స్‌’ (freezing Eggs) గురించి ఆమె స్పందించారు. కెరీర్‌, ఇతర కారణాల వల్ల అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు వయసులో ఉన్నప్పుడే తమ అండాలను శీతలీకరించుకుని.. ఆ తర్వాత నచ్చినప్పుడు పిలల్ని కంటారు. దీనినే ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ (Egg freezing)అంటారు. దీని గురించి మృణాల్‌ మాట్లాడుతూ  "ఫ్రీజింగ్‌ ఎగ్స్‌ పద్థతికి నేను సుముఖంగానే ఉన్నాను. భవిష్యత్తులో అవసరమైతే దీని గురించి ఆలోచిస్తాను’’ అని అన్నారు. ఈ పద్థతిలోనే  బాలీవుడ్‌ హీరోయిన ప్రియాంకా చోప్రా ఓ పాపకు తల్లయ్యారు. ఇక మృణాల్‌ సినిమాల విషయానికొస్తే.. ‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ తర్వాత మృణాల్‌ నటించిన తెలుగు చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఇటీవల థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె ‘పూజా మెరీ జాన్‌’లో నటిస్తున్నారు. 

Shruti Haasan: శృతిహ‌స‌న్ మ‌రో బ్రేక‌ప్‌.. ప్రియుడికి దూరంగా కొత్త ఫ్లాట్‌?

Updated Date - Apr 26 , 2024 | 02:45 PM