Mouni Roy: నా అందంపై నేనే విమర్శించుకున్నా! 

ABN , Publish Date - Feb 10 , 2024 | 06:11 PM

నాగిని సీరియల్‌తో విడుదలైన అన్ని భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకొన్నారు మౌనీరాయ్‌. అక్షయ్‌కుమార్‌ నటించిన ‘గోల్డ్‌’  చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. 2022లో బ్రహ్మాస్త్ర చిత్రంతో అలరించింది. అదే ఏడాది సూరజ్‌ నంబియార్‌ను పెళ్లాడింది.

Mouni Roy: నా అందంపై నేనే విమర్శించుకున్నా! 

నాగిని సీరియల్‌తో విడుదలైన అన్ని భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకొన్నారు మౌనీరాయ్‌(mouni roy) . అక్షయ్‌కుమార్‌ నటించిన ‘గోల్డ్‌’  చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. 2022లో బ్రహ్మాస్త్ర చిత్రంతో అలరించింది. అదే ఏడాది సూరజ్‌ నంబియార్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం వర్జిన్  ట్రీ చిత్రంతో బిజీగా ఉంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో తాను ఎదుర్కొన్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలు గురించి చెప్పుకొచ్చారు. ‘నేను అందంగా, ఆకర్షణీయంగా ఉండనని నన్ను నేను విమర్శించుకుంటూ అదే నిజమనే నిర్ణయానికి వచ్చా. ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఈ ఆలోచనల నుంచి బయటపడ్డా. నన్ను నేను ప్రేమించడం, నన్ను నేను అంగీకరించడంలో ధ్యానం ఎంతో ఉపయోగపడింది. ఈ విషయం నా స్నేహితులకు తెలుసు. అయితే బయటకు చెప్పడం, మీడియాకు వివరించడం ఇదే మొదటిసారి’’ అని తెలిపింది. 

Mouni.jpg

‘‘ ఇన్నేళ్ల  ఏళ్ల నటనా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ఇంత గొప్ప స్థాయిలో నిలిచేందుకు కారణమైన టెలివిజన్‌ కి రుణపడి ఉంటా. సినిమాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తానని భావించి ‘గోల్డ్‌’ చిత్రంలో నటించాను. అందులో నా పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. అందుకు నేను సరిపోతాను అనిపించి ఆ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. ఆ తర్వాత బాగానే చేస్తున్నానని మరికొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కు వెళ్లాను. లుక్‌ టెస్ట్‌ చేసి షార్ట్‌లిస్ట్‌ చేసిన వాళ్లలో రెండో స్థానంలో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ అవకాశాలు రాలేదు. వాటికి సరైన కారణాలు ఉండేవి కావు. సినీ పరిశ్రమ ఇలానే ఉంటుందని అప్పుడు అర్థమైంది.  ఏది జరిగినా, చేదు అనుభవాలు ఎదురైనా ముందుకే సాగాలి. ఇప్పుడు నేను చేయాలి అనుకున్నది చేయగలుగుతున్నాను అది నా అదృష్టం. నేను పడిన కష్టం, విధి విజయాన్ని అందించాయి’’ అని అన్నారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ హష్మీ ‘షో టైమ్‌’లో మౌనీరాయ్‌ నటిస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్‌, ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ దీనిని నిర్మిస్తున్నాయి.  

Updated Date - Feb 10 , 2024 | 06:12 PM