Mirzapur 4: ఊహకి మించి... ప్రస్తుతం ఏం జరుగుతోందంటే!

ABN , Publish Date - Jul 09 , 2024 | 06:32 PM

'మీర్జాపూర్‌ (Mirzapur).. ఓటీటీలో భారీ విజయం అందుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ఒకటి. ప్రస్తుతం దీని మూడో సీజన్‌ ‘మీర్జాపూర్‌ 3’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్  అవుతోంది.



'మీర్జాపూర్‌ (Mirzapur).. ఓటీటీలో భారీ విజయం అందుకున్న వెబ్‌సిరీస్‌ల్లో ఒకటి. ప్రస్తుతం దీని మూడో సీజన్‌ ‘మీర్జాపూర్‌ 3’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్  అవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సీజన్‌ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. తాజాగా దీని నాలుగో భాగంపై నటి అప్‌డేట్‌ ఇచ్చారు. మీర్జాపూర్‌ తొలి పార్ట్‌ నుంచి ఆ సిరీస్‌లో భాగమైన బాలీవుడ్‌ నటి షెర్నావాజ్‌ జిజినా (Sherrnavaz Jijina)తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాలుగో పార్ట్‌ గురించి మాట్లాడారు. ‘ప్రస్తుతం ‘మీర్జాపూర్‌ 4’ 9Mirzapur 4)స్క్రిప్ట్  వర్క్‌ జరుగుతోంది. ఎంతోమంది దానికోసం పని చేస్తున్నారు. నాలుగో సీజన్‌ మీ ఊహకు మించి ఉంటుంది. ఆశ్చర్యపోయేలా దీన్ని రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నారు. టీమ్‌లో వాళ్లంతా ప్రతిభావంతులు. ఒకదాని తర్వాత మరో సీజన్‌ను వెంటనే విడుదల చేయడానికి వాళ్లు ఎలా వర్క్‌ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీని తర్వాత సీజన్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మీర్జాపూర్‌4’ అతి త్వరలోనే విడుదలవుతుందని ఆమె చెప్పారు.

Mirzapur.jpg

ఇక ఈ సిరీస్‌పై వస్తోన్న విమర్శలపై షెర్నావాజ్‌ స్పందించారు. ‘మిగతా వాటితో పోలిస్తే ‘మీర్జాపూర్‌’ భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ గ్రాఫిక్స్‌ ఉపయోగించలేదు. అందుకే కాస్త నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీని మొదటి భాగం విడుదలైన సమయంలో ఎంతోమంది విమర్శించారు. హింసాత్మకంగా ఉందన్నారు. అయినా అది సూపర్‌ హిట్‌గా నిలిచింది. హింసాత్మక సన్నివేశాలను చిత్రీకరించడం చాలా కష్టం. ప్రేక్షకులు ఏది చూడాలనుకుంటున్నారో దాన్ని మేం అందిస్తాం. ఒకవేళ వాళ్లు ఇందులో హింసను చూడలేమంటే.. మేకర్స్‌ దానికి అనుగుణంగా తీస్తారు’’ అని అన్నారు. 

Updated Date - Jul 09 , 2024 | 06:32 PM