Mahesh Bhatt: నా నుంచి దూరం జరుగుతూ ఉండేది!
ABN , Publish Date - Feb 08 , 2024 | 06:15 PM
బాలీవుడ్‌లో అగ్ర దర్శక నిర్మాత మహేశ భట్ (Mahesh Bhatt) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన కుమార్తె షాహీన్ భట్ (Shaheen bhatt) )కోసం తన అలవాట్లను ఎలా మార్చుకున్నారో చెప్పుకొచ్చారు. ‘‘మద్యం మానేయడం ఓ యుద్థం. నేను అందులో గెలిచాను.
బాలీవుడ్‌లో అగ్ర దర్శక నిర్మాత మహేశ భట్ (Mahesh Bhatt) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన కుమార్తె షాహీన్ భట్ (Shaheen bhatt) )కోసం తన అలవాట్లను ఎలా మార్చుకున్నారో చెప్పుకొచ్చారు. ‘‘మద్యం మానేయడం ఓ యుద్థం. నేను అందులో గెలిచాను. నేను మద్యం మానేశానంటే జనాలు ఆశ్చర్యపోతారు. కానీ అది నిజం. అందుకు కారణం నా కుమార్తె షాహీన్. షాహీనను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు తను నా నుంచి దూరం జరుగుతూ ఉండేది. అది నాకెందుకో నచ్చలేదు. ఆ చిన్నారి జీవితం నాకు ఏదో చెబుతోందని భావించ తాగడం మానేశాను. అప్పుడే నాలో ఓ తండ్రి పుట్టాడు. ఏ డాక్టర్ దగ్గరికీ వెళ్లకుండానే నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డాను. నన్ను మార్చింది నా కుమార్తే’’ అని మహేశ్ భట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆయన రెండో కుమార్తె ఆలియా భట్ తన తండ్రి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓ సందర్భంలో ‘‘మా నాన్న తెరకెక్కించినా చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయన మద్యానికి బానిస అయ్యారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొంతకాలానికి ఆయన మద్యాన్ని వదిలేశారు. నా తల్లిదండ్రులిద్దరూ ఎంతో శ్రమించి తిరిగి ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని అన్నారు. ‘డాడీ’, ‘ఆషికీ’, ‘కబ్జా’, ‘సడక్’, ‘క్రిమినల్’ వంటి చిత్రాలకు మహేశ్‌భట్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే! 1984లో ఆయన రూపొందించిన ‘సారాంశ్’ 14వ మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు