Kriti Sanon: ఆ అవకాశం ఇప్పుడు నా చేతిలోనే ఉంది

ABN , Publish Date - Dec 02 , 2024 | 09:29 AM

నటిగానే కాదు.. నిర్మాతగానూ బిజీగా ఉన్నారు కృతీసనన్‌(Kriti Sanon). ఆమె నటించి, నిర్మించిన 'దో పత్తి’ (Dho patti) చిత్రం ఈ అక్టోబర్‌లో విడుదలైంది. ప్రస్తుతం తన నిర్మాణంలో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి.


నటిగానే కాదు.. నిర్మాతగానూ బిజీగా ఉన్నారు కృతీసనన్‌(Kriti Sanon). ఆమె నటించి, నిర్మించిన 'దో పత్తి’ (Dho patti) చిత్రం ఈ అక్టోబర్‌లో విడుదలైంది. ప్రస్తుతం తన నిర్మాణంలో కొన్ని కథలు చర్చల్లో ఉన్నాయి. నిర్మాతగా తను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన కథలు చాలా ఉన్నాయని కృతీ అంటున్నారు.  ప్రస్తుతం ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘తేరే ఇష్క్‌ మే’ (Tere Ishq mein) సినిమా చిత్రీకరణలో ఉంది కృతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నిర్మాతగా తన ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు.

‘‘కెరీర్‌లో ఈ కొత్త దశను ఆస్వాదిస్తున్నా. నా నిర్మాణ సంస్థ ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిల్మ్స్‌’(blue butterfly films) లో మరికొన్ని కొత్త సీతాకోకచిలుకలు రాబోతున్నాయి. దీని కోసమే భారతీయ సినిమాలో తెరపైకి రాని కథల కోసం పరిశోధన చేస్తున్నా. సినీప్రేమికులను ఆశ్చర్యపరిచే చిత్రాలను రూపొందించాలని టార్గెట్‌ పెట్టుకున్నా. ఇప్పటి వరకూ నేను నటించని పాత్రల్ని సృష్టించుకునే అవకాశం ఇప్పుడు నా చేతిలోనే ఉండడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే చిత్రాలను నిర్మించే స్థాయికి చేరుకుంటానని ఆశిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది. కృతిసనన్‌ '1 నేనొక్కడినే' చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమైంది. తదుపరి 'దోచేయ్‌' చిత్రంలో మెరిసింది. రెండు చిత్రాలు పరాజయం కావడంతో తెలుగు చిత్రాలకు దూరమైంది. ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది.

Updated Date - Dec 02 , 2024 | 09:30 AM