Keerthy Suresh: కల్చర్ ఫస్ట్, సినిమా నెక్స్ట్.. కీర్తి సురేష్

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:34 AM

కీర్తి సురేష్ తన ఆచార సంప్రదాయాలతో బాలీవుడ్‌ని షాక్ కి గురి చేసింది. మరోవైపు తన డ్రీమ్ ఐకాన్ స్టార్ తన పెళ్ళికి రావడంతో ఉబ్బి తబ్బిపోతుంది

ఇటీవల టాలెంటెడ్ యాక్ట్రెస్ 'కీర్తి సురేష్' పెళ్లి గోవాలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో జరిగిన విషయం తెలిసిందే. కీర్తి తన చిన్న నాటి మిత్రుడు, వ్యాపారవేత్త 'ఆంటోనీ తట్టిల్‌'ని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి మధ్య 15 ఏళ్ల నుండి ప్రేమాయణం కొనసాగుతుంది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కీర్తి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మన 'మహానటి' ఏం చేసిందంటే..


సాధారణంగా పెళ్ళైన తర్వాత చాలా మంది బాలీవుడ్ గుమ్మలు మెడలో మంగళ‌ సూత్రం, కాలికి మెట్టెలు, నుదట సింధూరం వంటివి కనపడకుండా జాగ్రత్త పడతారు. కానీ.. కీర్తి సురేష్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ కు భిన్నంగా వ్యవహరించారు. తాజాగా తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'బేబీ జాన్' ప్రమోషన్స్ కి వెళ్లిన ఆమె మెడలో తాళిబొట్టు, చేతులకు, కాళ్లకు పారాణితో కనిపించారు. అలాగే కాళ్లకు మెట్టెలు ధరించారు. దీంతో బాలీవుడ్ జనాలు కాస్త షాక్ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్ మేల్ లీడ్ గా నటించిన 'బేబీ జాన్' డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకి రానుంది.


కొత్త జంటని కలిసిన దళపతి విజయ్

ఇటీవలే గోవాలో జరిగిన కీర్తి సురేష్ పెళ్ళికి లిమిటెడ్ గెస్ట్ లను మాత్రమే ఆహ్వానించారు. దీంతో ప్రముఖ నటీనటులు ఎవ్వరు ఈ పెళ్ళిలో సందడి చేయలేదు. కానీ కీర్తి సురేష్ కి ఎంతో స్పెషల్ అయినా దళపతి విజయ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఫోటోను కీర్తి తన సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి. కీర్తి నటిస్తున్న 'బేబీ జాన్' విజయ్ 'తేరి' మూవీ రీమేక్. ఇప్పటికే విజయ్, కీర్తి కాంబినేషన్ లో భైరవ, సర్కార్ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 19 , 2024 | 11:44 AM