kartik aaryan: రెండు చిత్రాలు.. రెండు జానర్లు.. భయమే లేదు

ABN , Publish Date - Oct 14 , 2024 | 01:08 PM

ఒకే రోజు రెండు పెద్ద చితాల్రు విడుదల కానుండడంతో బాలీవుడ్‌లో (Bollywood) సందడి వాతావరణం నెలకొననుంది.


ఒకే రోజు రెండు పెద్ద చితాల్రు విడుదల కానుండడంతో బాలీవుడ్‌లో (Bollywood) సందడి వాతావరణం నెలకొననుంది. నవంబర్‌ 1న కార్తిక్‌ ఆర్యన్‌ (Karthik Aaryan) ప్రధాన పాత్రలో నటించిన ‘భూల్‌ భులయ్యా 3’ (Bhool Bhulaiyaa 3), అజయ్‌ దేవ్‌గణ్‌ హీరోగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’ (Singham Again) ఈ రెండూ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఈ నేపథ్యంలో  కార్తిక్‌ మాట్లాడుతూ.. ‘సింగమ్‌ అగైన్‌’తో పోటీపై మాట్లాడారు.

‘‘దీపావళి ముఖ్యమైన పండగ. ఆ రోజున విడుదల కానున్న రెండు సినిమాలు కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటాయని నమ్మకం ఉంది. ‘సింగమ్‌ అగైన్‌’ యాక్షన్‌ సినిమా కాగా.. మా చిత్రం హారర్‌ కామెడీ జానర్‌. ఈ రెండింటికీ పోటీ లేదు. దేనికదే డిఫరెంట్‌ చిత్రాలు. నవంబర్‌ 1 సినీప్రియులకు నిజమైన పండగ. ఇలాంటి సినిమాలు తరచూ రావు. పెద్ద సినిమాలు రెండూ కూడా సందర్భం లేకపోతే ఒకేసారి విడుదల కావు. దీపావళి ప్రత్యేక సందర్భం కాబట్టి ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. నేను ‘సింగమ్‌ అగైన్‌’ మొదటిరోజే చూస్తాను. ప్రేక్షకులు  రెండు సినిమాలను కచ్చితంగా ఆదరిస్తారు.  నేను అజయ్‌ సినిమాను పోటీగా చూడడం లేదు. ఇవి ఫ్రాంచైజీలు భాగంగా భావిస్తున్నా నంతే. నాకు ఆ చిత్రబృందం లోని ప్రతి ఒక్కరిపైనా అభిమానం ఉంది’’ అని స్పష్టం చేశారు.  ుభూల్‌ భులయ్య 3’ చిత్రానికొస్తే కార్తిక్‌ ఆర్యన్‌, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన చిత్రమిది. విద్యాబాలన్‌, మాధూరి దీక్షిత్‌ కీలక పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అనీస్‌ బాజ్మీ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 1వ తేదీన ఇది విడుదల కానుంది.  

Updated Date - Oct 14 , 2024 | 01:08 PM