Kareena Kapoor: వారితో పోటీగా సక్సెస్‌ సాధించగలను!

ABN , Publish Date - Jul 23 , 2024 | 11:38 AM

వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది కరీనా కపూర్‌. అంతే కాదు.. నేటితరంతో పోటీ పడుతూ హిట్స్‌ అందుకోగలను అంటోంది. త్వరలో ‘ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు అంగీకరిస్తానంటోంది

వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది కరీనా కపూర్‌(Kareena Kapoor). అంతే కాదు.. నేటితరంతో పోటీ పడుతూ హిట్స్‌ అందుకోగలను అంటోంది. త్వరలో ‘ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’తో (The Buckingham Murders) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆమె రెమ్యునరేషన్ గురించి ఆలోచించకుండా సినిమాలు అంగీకరిస్తానంటోంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కరీనా.. కథల కలెక్షన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘‘బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం (No issue with Remunaration) తీసుకునే కథానాయికల్లో నేను ఒకదాన్ని. కానీ.. రెమ్యునరేషన్‌ని దృష్టిలో ఉంచుకొని కథల్ని ఎంచుకోను. ఇది నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం. సినిమా ఎలాంటిది? అందులో నా పాత్ర ప్రాధాన్యత తదితర అంశాల్ని చూసుకుంటాను. ప్రేక్షకులకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ.. సమాజంపై ప్రభావం చూపించేలా ఆ సినిమా ఉంటే.. కచ్చితంగా తక్కువ రెమ్యునరేషన్‌ అయినా నటించడానికి అంగీకరిస్తాను’’ అని చెప్పుకొచ్చింది.

Kareena-a.jpg

‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకులతో  సమానంగా హీరోయిన్లు ముందుకు సాగుతున్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ.. చిత్ర పరిశ్రమలో నాయికలకు ఓ వయసు వచ్చాక సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటూ పేర్లు పెడుతున్నారు. దాదాపు 44 ఏళ్ల వయసులో ఉన్న నేను కూడా రికార్డు బద్దలు కొట్టగలను’’ అని చెప్పుకొచ్చింది.  

'ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’ చిత్రాన్ని  గతంలో లండన్ ఫిలిం ఫెస్టివల్, ముంబై ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటిటీ లో స్ట్రీమింగ్ కానుంది 

Updated Date - Jul 23 , 2024 | 12:07 PM