Dhadak 2: రెండో భాగం.. మొత్తం మార్చేశారు!
ABN , Publish Date - May 27 , 2024 | 08:26 PM
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ (Dhadak 2). శశాంక్ (Sashank) దర్శకత్వంలో ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన తొలి చిత్రం ‘ధడక్’ (Dhadak 2). శశాంక్ (Sashank) దర్శకత్వంలో ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొంది. ఇప్పుడీ హిట్ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు మేకర్స్. మొదటి పార్ట్‌లో చేసిన హీరోహీరోయిన్లను మారుస్తున్నట్లు చెప్పారు. ‘ధడక్’లో హీరోగా ఇషాన్ ఖట్టర్ నటించగా హీరోయిన్‌గా జాన్వీ కపూర్ అలరించారు. ఇప్పుడు ‘ధడక్2’లో జాన్వీ స్థానంలో త్రిప్తి డిమ్రి, ఇషాన్ కు బదులు సిద్థాంత్ చతుర్వేదిని తీసుకున్నారు.
ఈ విషయాన్ని చెబుతూ నిర్మాత కరణ్ జోహార్ పోస్ట్ పెట్టగా.. జాన్వీ దాన్ని వెంటనే లైక్ చేశారు. ఈ సీక్వెల్‌కు షాజియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీకి ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా ప్రమోషన్స్‌లోనే శ్రీదేవి మరణించారు. ఆ బాధను మర్చిపోవడం కోసం జాన్వీ ఈ ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.