Kangana Ranaut: వీడ్కోలు పలకాలనుకుంటున్నా..
ABN , Publish Date - May 19 , 2024 | 04:32 PM
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే! ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా? అనే ప్రశ్నకు ఆమె అవుననే జవాబిచ్చారు. ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
నటిగా బాలీవుడ్‌లో (Bollywood) నేను విజయం సాధించా. ఎన్నో అవార్డులు గెలుచుకున్నా. మండి ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా. ఒక ఉత్తమ ఎంపీగా (BJP MP) ప్రజలకు నా వంతు కృషి చేస్తా. అదే నాకు గొప్ప అవార్డుగా భావిస్తా’’ అని కంగనా రనౌత చెప్పారు. మరో వైపు సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుతూ నిర్మాతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ‘మీరొక ప్రతిభావంతమైన నటి. సినిమాలకు దూరంగా ఉండొద్దు’ అని చాలా మంది నిర్మాతలు, నటులు కోరుతున్నారు’’ అని ఆమె చెప్పారు. అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోలా స్పందించారు కంగనా. ‘‘ఎన్నికల ముందు నేను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కారణంతో వెంటనే బాలీవుడ్‌ను విడిచిపెట్టలేను’’ అని పేర్కొన్నారు.
కంగనా నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). జూన్ 14న విడుదల కానున్న ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. ఈ చిత్రంలో కంగనా నటిస్తూ దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇందులో కంగనా ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు.