Kangana Ranaut: అతనికి పెళ్లైంది.. జీవితం నాశనం చేయకండి!
ABN , Publish Date - Jan 24 , 2024 | 07:12 PM
నిత్యం వివాదాలలో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా తన డేటింగ్ గురించి బయటపెట్టి మరోమారు వార్తల్లో కెక్కింది. గత కొంతకాలంగా ఓ ప్రముఖ వ్యక్తితో కంగన డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లుగానే ఉండిపోయాయు. తాజాగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై జై శ్రీరామ్ అంటు నినాదాలతో హోరెత్తించింది. అయితే అక్కడొక వ్యక్తితో కంగనా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో అతనే ప్రియుడు అంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది.
నిత్యం వివాదాలలో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) తాజాగా తన డేటింగ్ గురించి బయటపెట్టి మరోమారు వార్తల్లో కెక్కింది. గత కొంతకాలంగా ఓ ప్రముఖ వ్యక్తితో కంగన డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లుగానే ఉండిపోయాయు. తాజాగా అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరై జై శ్రీరామ్ అంటు నినాదాలతో హోరెత్తించింది. అయితే అక్కడొక వ్యక్తితో కంగనా సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో అతనే ప్రియుడు అంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది.
ఈ వ్యవహారం కంగనా (Kangana Ranaut) వరకు వెళ్లడంతో ఆమె స్పందించి ఓ క్లారిటీ ఇచ్చింది. ఈజ్ మై ట్రిప్ (Ease MyTrip) వ్యవస్థాపకుడైన నిషాంత్ పిట్టి (Nishanth pitti)తో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరగడం ఆశ్చర్యంగా ఉందని, అతనితో ‘నిషాంత్ తో ప్రేమలో ఉన్నాననే వార్తలన్నీ వదంతులు మాత్రమే. నని, వాటిని నమ్మొద్దని, అతనికి పెళ్లైందని అతని జీవితాన్ని నాశనం చేయొద్దు’ అని కోరింది. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ నన్ను ట్యాగ్ చేస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారని, నేను డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని, ఆ వివరాలు చెప్పేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొంది.
ఇతరులతో కలిసి ఫొటో దిగినంత మాత్రాన సంబంధాలు అంటగట్టడం భావ్యం కాదని, ఓ వ్యక్తితో చనువుగా ఉండడానికి చాలా కారణాలు ఉంటాయని, వారు బంధువులు, స్నేహితులు, సహోద్యోగులు అయి ఉండొచ్చు కదా అని నెటిజన్లపై ఫైర్ అయింది. నాతో ఉన్న వ్యక్తి నా హెయిర్ స్టైలిష్ట్. నేను కొన్ని సంవత్సరాలుగా అతడి ఫ్రెండ్లీ కస్టమర్‌ని’’ అని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అయితే గతంలోను చాలా సార్లు కంగనాపై ఇలాంటి రూమర్సే వచ్చినప్పటికీ వాటిని ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు, స్పందించిన సందర్భాలు అసలే లేవు తాజాగా ఈ ఇష్యూ అంతకంతకు రెట్టింపవడంతో కంగనా (Kangana Ranaut) నే స్వయంగా రంగంలోకి దిగి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది.