Janhvey Kapoor: ఆ తరహా చిత్రాలే ఎదుగుదలకు ఉపయోగపడతాయి

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:06 PM

భారీ కమర్షియల్‌ చిత్రాల్లో నటించలేకపోవడం గురించి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvey kapoor) మాట్లాడారు. కమర్షియల్‌ సినిమాల్లో చేస్తే డబ్బు, ఫేమ్‌ సులభంగా వస్తుంది. కానీ అలా చేయడం నాకు నచ్చదు.

భారీ కమర్షియల్‌ చిత్రాల్లో నటించలేకపోవడం గురించి బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ (Janhvey kapoor) మాట్లాడారు. కమర్షియల్‌ సినిమాల్లో చేస్తే డబ్బు, ఫేమ్‌ సులభంగా వస్తుంది. కానీ అలా చేయడం నాకు నచ్చదు. కావాలనుకుంటే నటిగా సక్సెస్‌ అయ్యేందుకు సులభమైనమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలకు బదులు గ్లామర్‌ క్యారెక్టర్స్‌తో ఉన్నకమర్షియల్‌ సినిమాలు చేసి ఉండొచ్చు. అలాంటి చిత్రాల్లో నటిస్తే  త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్తాం. పాపులారిటీ, బాక్సాఫీస్‌ నంబర్లు గ్యారంటీగా వస్తాయి. నాలో ఆలోచనల్లో కమర్షియల్‌ యాంగిల్‌ లేదు. సినిమా రంగంలో నటిగా రాణించడమనేది చాలా క్లిష్టమైన విషయం. విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందజేయడమే లక్ష్యంగా చిత్రాలు ఎంచుకుంటున్నా. దానివల్ల విజయాల కంటే కూడా పరాజయాలు వస్తుంటాయి. కానీ, ఒక నటిగా ఇలాంటి చిత్రాలు నా ఎదుగుదలకు మరింత ఉపయోగపడతాయని నమ్ముతున్నా. సవాల్‌ విసిరే పాత్రలు చేయడమే నాకు ఆనందంగా ఉంటుంది’’ అని అన్నారు.

janhveyy.jpg

జాన్వీకపూర్‌ నటించిన తాజా చిత్రం 'ఉలఝ్‌’. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా తెరకెక్కించారు. జంగ్లి పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. జాన్వీ ఇందులో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారిణిగా కనిపించనుంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌లో గుల్షన్‌ దేవయ్య, రాజేశ్‌ థైలాంగ్‌ ముఖ్య ్క్ష?త్ర?ని పోషించారు. ఆగస్టు 2న ఇది విడుదల కానుంది.  తెలుగులో ఆమె దేవర చిత్రంలో నటిస్తోంది. దానితో పాటు రామ్‌చరణ్‌, సానా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న చిత్రంలో కూడా ఆమె కథానాయికగా ఎంపికైంది. 

Updated Date - Jul 25 , 2024 | 05:06 PM