Ira Khan: మానసిక ప్రశాంతత కోల్పోయాను

ABN , Publish Date - Nov 30 , 2024 | 07:09 PM

తన తండ్రి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌(Aamir khan), తల్లి రీనాదత్తా (Reena Dutta)విడిపోవడంపై నటి ఐరా ఖాన్‌ (Ira khan) స్పందించారు.

తన తండ్రి బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌(Aamir khan), తల్లి రీనాదత్తా (Reena Dutta)విడిపోవడంపై నటి ఐరా ఖాన్‌ (Ira khan) స్పందించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ "విడాకుల అనంతరం వారి జీవితాలు మారిపోయాయి. నేను మాత్రం మానసిక ప్రశాంతత కోల్పోయాను. ‘‘నా చిన్నతనంలో ఇంట్లో ఎప్పుడూ సందడిగా ఉండేది. నా తల్లిదండ్రులు గొడవ పడిన సందర్భాలు చాలా తక్కువ. కుటుంబ సభ్యులు ఎదురుగా వాళ్లెప్పుడూ గొడవలు పడలేదు. సంతోషంగా ఉండేవాళ్లం. వాళ్లు విడాకులు తీసుకున్న సమయంలో అది నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపించదనుకున్నా. అది ఒక్కరోజులోనే తీసుకున్న నిర్ణయం కాదని ఆ తర్వాతే తెలిసింది. దానివల్ల వారి జీవితాలు మారిపోవడంతో ఎంతో బాధపడ్డా. మానసికంగా కుంగుబాటుకు గురయ్యా. థెరపిస్ట్‌ సలహాలు తీసుకున్నా. ఆ విషయంలో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నా. విడిపోయినప్పటికీ తల్లిదండ్రులిద్దరూ నన్ను, సోదరుడు జునైద్‌ ఖాన్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ మాకు ప్రేమను పంచుతున్నారు’’ అని ఐరా ఖాన్‌ అన్నారు.

ఆమిర్‌ ఖాన్‌ - రీనా దత్తా 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐరా, జునైద్‌ ఇద్దరు పిల్లలు. అనుకోని కారణాల వల్ల 2002లో విడాకులు తీసుకున్నారు. ఐరాఖాన్‌ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమిర్‌ ఖాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. మానసిక ఆరోగ్యం గురించి తరచూ ఆమె నెటిజన్లకు సలహాలు ఇస్తుంటారు. అవసరం అయినప్పుడు ఎవరైనా థెరపిస్ట్‌ను కలవడంలో తప్పు లేదన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 07:09 PM