Bassist Mohini dey: తండ్రిలాంటి వ్యక్తితో లింక్.. చాల బాధాకరం
ABN , Publish Date - Nov 26 , 2024 | 12:17 PM
‘నాది, రెహమాన్ కుమార్తెది ఒకే వయసు. ఆయనెప్పుడూ నన్ను తన కుమార్తెలానే చూసేవారు. 8 ఏళ్లకు పైగా ఆయన బృందంలో పనిచేశాను. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది.
రెహమాన్(AR Rahman), సైరాబాను (Saira banu)విడాకులతో తనకు లింక్ చేస్తూ జరుగుతున్న ప్రచారంపై బేసిస్ట్ మోహినిదే (Mohini dey) మరోసారి స్పందించారు. రెహమాన్ తనకు తండ్రితో సమానమన్నారు. ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రెహమాన్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ఇలాంటి రూమర్స్ రావడం బాధాకరం అన్నారు.
'‘నాది, రెహమాన్ కుమార్తెది ఒకే వయసు. ఆయనెప్పుడూ నన్ను తన కుమార్తెలానే చూసేవారు. 8 ఏళ్లకు పైగా ఆయన బృందంలో పనిచేశాను. ఆయనంటే ఎంతో గౌరవం ఉంది. ఎన్నో సినిమాలకు ఆయనతో కలిసి మ్యూజిక్ అందించాను. మేమంతా ఎన్నోస్టేజి షోలు చేశాం. మాపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో సానుభూతి లేకుండా నిందలు వేయడం సరికాదు. కనీసం మా ఇద్దరి వయసు గురించి కూడా ఆలోచించకుండా కామెంట్స్ చేస్తున్నారు. ఇవి సృష్టించిన వారి మానసిక స్థితి చూస్తే బాధతో పాటు జాలేస్తోంది. ఇలా అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలి’’ అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ "సంగీత రంగంలో ‘రెహమాన్ ఒక లెజెండ్, నా కెరీర్‌లో ఆయన కీలకపాత్ర పోషించారు. నా జీవితానికి రోల్‌మోడల్ ఆయన. నాకు సంగీతం నేర్పిన నా తండ్రిని ఏడాది క్రితం కోల్పోయాను. అప్పటినుంచి ఈ బృందంలోని వారే సొంతవారిలా నన్ను ఆదరించారు. మీడియాకు వ్యక్తుల మనసుతో పని లేదు. మీడియాలో వచ్చే కామెంట్స్ జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతారో అర్థం చేసుకోలేరు. ఇలాంటి వార్తలు నా కెరీర్‌కు అంతరాయం కలిగించలేవు. దయచేసి వీటికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టండి. మా గోప్యతను గౌరవించండి'’ అని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.
రెహమాన్‌పై జరుగుతున్న ప్రచారంపై ఆయన కూడా స్పందించారు. వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా, యూట్యూబ్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన లీగల్ టీమ్ హెచ్చరించింది. ఏ సామాజిక మాధ్యమం వేదికలోనైనా అసత్య ప్రచారం చేేస్త పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్టు తెలిపింది.