Heroines: హీరోయిన్లు.. హాట్ హెల్త్ టిప్స్
ABN , Publish Date - Apr 14 , 2024 | 10:57 AM
వేసవి అనగానే హడలిపోతారు అమ్మాయిలు. వడదెబ్బ, ర్యాషెస్, ట్యాన్.. వంటి సమస్యలు భయపెడతాయి. అలాగని బయటకు వెళ్లకుండా ఉండలేరు(Beauty tips) కదా.
వేసవి అనగానే హడలిపోతారు అమ్మాయిలు. వడదెబ్బ, ర్యాషెస్, ట్యాన్.. వంటి సమస్యలు భయపెడతాయి. అలాగని బయటకు వెళ్లకుండా ఉండలేరు(Beauty tips) కదా. హాట్ సమ్మర్‌ని కూల్‌గా మార్చే హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ (Summer Health tips) గురించి కొందరు తారలు ఏం చెబుతున్నారంటే...
ఇంటి భోజనానికే ఓటు...
ఈ సీజన్‌లో నేనైతే పొద్దున్నే బొప్పాయి పండు ముక్కల్ని నిమ్మరసం పిండుకుని తింటాను. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతా. సలాడ్స్, ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటా. ఆహారంలో చిరుధాన్యాలు, కూరగాయలు ఉండేలా చూస్తా. మామూలుగా అయితే రోజూ వర్కవుట్స్ చేస్తా. కానీ ఈ సీజన్‌లో పైలెట్స్, డ్యాన్స్‌కి ప్రాధాన్యం ఇస్తా. ఎప్పుడూ నీళ్ల బాటిల్ వెంట ఉండాల్సిందే. అలాగే బిగుతు బట్టలకు బదులుగా తేలికపాటి దుస్తులు లేదా వైట్ షర్ట్, జీన్స్ ధరించడానికే ఇష్టపడతా.
- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ( jacqueline fernandez)
కొబ్బరినీళ్లతో మసాజ్
వేసవిలో కాళ్లు, చేతులు మొత్తం శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరిస్తా. షూటింగ్ లేకపోతే మేకప్ జోలికిపోను. బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం పక్కాగా సన్‌స్ర్కీన్ లోషన్, మాయిశ్చరైజర్ అప్లై చేస్తా. అలాగే కొబ్బరినీరు తరుచుగా తాగడం మాత్రమే కాదు, ముఖానికి కూడా రాస్తా. కొబ్బరినీరును ఐస్ ట్రేలో ఉంచి కొంత సమయం తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేసుకుంటా. దీనివల్ల అలసట పోతుంది. ఈ కాలంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి రోజంతా నీరు తాగుతూనే ఉంటా. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకుంటా.
- యామీ గౌతమ్ (Yami goutham)
Salman Khan: గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఇంటిపై కాల్పులు..
వేసవి అంటేనే ఇష్టం
చెబితే నమ్మరు కానీ నేను వేసవి కాలాన్నే బాగా ఆస్వాదిస్తా. అవుట్‌డోర్ షూటింగ్ ఉంటే.. మేకప్ వేసుకోవడం, విభిన్న రకాల దుస్తులు ధరించడం... వగైరా చికాకులుంటాయి. షూట్ లేకపోతే ఏ సమస్య లేదు. మామూలుగానే నేను కాటన్ దుస్తులు ధరిస్తా కాబట్టి ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి డ్రెస్సింగ్ ఫాలో అవ్వను. తక్కువ ఆయిల్, నాన్ స్పైసీ డైట్ మాత్రమే తీసుకుంటా. పుచ్చకాయ లాంటి సీజనల్ పండ్లతో పాటు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటా. ప్రతీరోజూ 4 నుంచి 5 లీటర్ల నీరు తాగుతా.
- కత్రినా కైఫ్ (Katrina kaif)
లేత రంగులు మేలు
ఎండాకాలంలో ధరించే దుస్తులకు సంబంధించి రంగులను ఆచితూచి ఎంపిక చేసుకోవాలి. ముదురు రంగులకు గుడ్‌బై చెప్పి లేత రంగులనే ఎంపిక చేసుకుంటా. బయటకు వెళ్లినప్పుడు ముఖానికి టోనర్ అప్లై చేస్తా. టోనర్ అనేది చర్మంలో పీహెచ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. అలాగే ఎండలోంచి వచ్చిన వెంటనే చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటా. ఇలా రోజుకు 3-4సార్లు చేయడం వల్ల ట్యానింగ్ సమస్య పోతుంది. బయటకు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే కచ్చితంగా తలకు టోపీ ధరిస్తా.
- పూజా హెగ్డే (pooja hegde)
వ్యాయామం తప్పనిసరి
సమ్మర్‌లో నిమ్మరసం, కొబ్బరినీళ్లు, పల్చటి మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటా. దీనివల్ల శరీరానికి తేమ అందుతుంది. తద్వారా డీ హైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు రక్షణగా సన్‌గ్లాసెస్ ధరిస్తా. చాలామంది ఈ సీజన్‌లో వేడికి భయపడి వర్కవుట్స్ మానేస్తారు. అయితే సరిగ్గా వినియోగించుకుంటే ఇది మజిల్ టోనింగ్‌కి, ముఖ్యంగా బరువు తగ్గేందుకు ఉపయుక్తమైన సీజన్. వేసవిలో ఆక్వా యోగా, జుంబా, స్విమ్మింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతా.
- అలియా భట్ (Alia bhatt)