Janhvi Kapoor Vs Gulshan Devaiah: జాన్వీపై కామెంట్స్.. హీరో క్లారిటీ!
ABN , Publish Date - Jul 23 , 2024 | 10:13 AM
జాన్వీ కపూర్ (Janhvey Kapoor), గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) నటించిన సినిమా ‘ఉలఝ్’ (Ulajh). స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం వీరిద్దరూ తొలిసారి జతకట్టారు. సుదాన్షు సరియ దర్శకత్వం వహించారు.
జాన్వీ కపూర్ (Janhvey Kapoor), గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah) నటించిన సినిమా ‘ఉలఝ్’ (Ulajh). స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం వీరిద్దరూ తొలిసారి జతకట్టారు. సుదాన్షు సరియ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఇటీవల గుల్షన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్ లేదని అన్నారు. సన్నివేశాల చిత్రీకరణ సమయంలోనే తనతో మాట్లాడేదని కామెంట్ చేశారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో గుల్షన్ క్లారిటీ ఇచ్చారు. ‘జాన్వీ కపూర్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మా ఇద్దరి మధ్య స్నేహం లేదన్నాను అంతే. తను రిజర్వ్‌డ్‌గా ఉండేది.. అది మా ఇద్దరి తప్పు కాదు. ఆమె మంచి నటి. చాలా ప్రొఫెషనల్‌గా యాక్ట్ చేస్తారు. మా సన్నివేశాలు బాగా వచ్చాయి. చేేస ప్రతి సినిమా సెట్‌లోనూ చిత్రబృందమంతా కుటుంబంలా కలిసిపోవాలనే నిబంధన లేదు కదా!. నేను ఎవరినీ కించపరచడం లేదు. ఉద్దేశపూర్వకంగా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. దర్శకుడు చెప్పినట్లు సినిమా కోసం మేం వందశాతం పనిచేశాం. గతంలో చాలా మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నా. వారందరితో నాకు మంచి స్నేహం ఉంది. రాధికా ఆప్టే, సోనాక్షి సిన్హా తో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. మేము ఎన్నో విషయాలను చర్చించుకునే వాళ్లం. కానీ, జాన్వీతో సినిమా గురించి మాత్రమే చర్చించాను. ఇదే విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాను. అంతకు మించి ఆమె గురించి నేను ఏమీ మాట్లాడలేదు’’ అని అన్నారు. గుల్షన్ చేసిన వ్యాఖ్యలపై జాన్వీ కూడా స్పందించారు. నిజంగానే సెట్‌లో ఎప్పుడూ ఇతర విషయాలు మాట్లాడుకోలేదన్నారు. దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ ఇది’’ అని జాన్వీ అన్నారు.