Deepika Padukone: కూతురు పేరు రివీల్ చేసిన దీపికా.. అబ్బా ఎంత మంచి పేరు
ABN , Publish Date - Nov 02 , 2024 | 12:32 PM
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తన కూతురు పేరును రివీల్ చేసింది. ఎంతో పవిత్రమైన అర్థం కలిగిన పేరు ఎంతో బాగుందని సెలబ్రిటీల నుండి ఫ్యాన్స్ వరకు అంత సంతోషంగా హార్ట్ సింబల్స్ పెడుతున్నారు. ఇంతకీ దీపికా కూతురు పేరు ఏంటంటే..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone), డైనమిక్ & ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh) జంట సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆడపిల్ల ఎంట్రీతో దీప్‌వీర్ (Deepveer) కుటుంబంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆ ఫొటోలోని దీపికా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అలాగే కూతురు పేరును కూడా రివీల్ చేసింది. ఎంతో పవిత్రమైన అర్థం కలిగిన పేరు ఎంతో బాగుందని సెలబ్రిటీల నుండి ఫ్యాన్స్ వరకు అంత సంతోషంగా హార్ట్ సింబల్స్ పెడుతున్నారు. ఇంతకీ దీపికా కూతురు పేరు ఏంటంటే..
దీపికా, రణ్వీర్ చేసిన ప్రేయర్ల తర్వాత ఈ పాప జన్మించడటంతో అమ్మాయికి 'దువా పదుకొణె సింగ్' (Dua Padukone Singh) అని నామకరణం చేశారు. దువా అంటే హిందీలో ప్రార్థన అని అర్ధం.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ చిత్రంలో తొలిసారి దీపికా - రణ్వీర్ సింగ్ జంటగా నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు రణ్వీర్.