Deepika Padukone: దీపిక తల్లయ్యారు.. తల్లీ బిడ్డ క్షేమం
ABN , Publish Date - Sep 08 , 2024 | 01:53 PM
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika padukone) తల్లి అయ్యారు.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె (Deepika padukone) తల్లి అయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు (Baby girl) జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం దీప్‌వీర్ (Deepveer)ఇద్దరూ ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే! దీపిక - రణ్‌వీర్ సింగ్ దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. (Deepveer blessed with baby girl)
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ చిత్రంలో తొలిసారి దీపికా - రణ్‌వీర్ సింగ్ జంటగా నటించారు. ఈ షూటింగ్ సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. గతేడాది ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు రణ్‌వీర్. ప్రస్తుతం ఆయన ‘సింగమ్ అగైన్’ కోసం వర్క్ చేస్తున్నారు. మరోవైపు, ‘కల్కి 2898 ఏడీ’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటి దీపిక.