Deepika - Ranveer: సెప్టెంబర్‌లో డేట్‌ ఫిక్స్‌!

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:25 AM

బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా-రణ్‌వీర్‌లు ఫ్యాన్సకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌తో వెల్లడించారు.

Deepika - Ranveer: సెప్టెంబర్‌లో డేట్‌ ఫిక్స్‌!

బాలీవుడ్‌లో బెస్ట్‌ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా(Deepika padukone)-రణ్‌వీర్‌లు ఫాన్స్ కు  గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌తో వెల్లడించారు. సెప్టెంబర్‌లో డెలివరీ డేట్‌ ఇచ్చినట్లు దీపిక పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. దీంతో సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న గాయని శ్రేయాగోషల్‌.. 'ఓ మై గాడ్‌.. సో ఎగ్జైటెడ్‌ కంగ్రాట్స్‌’ అని కామెంట్‌ చేశారు.‘రామ్‌ లీలా’ కోసం దీపిక-రణ్‌వీర్‌ మొదటిసాకి జగకట్టారు. ఈ సినిమా టైమ్‌లో దీపికతో ఆయనతో ప్రేమలో పడ్డారు. 2018, నవంబర్‌లో ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. తమ మధ్య ఉన్న ప్రేమను వివాహ బంధంతో శాశ్వతమైన అనుబంధంగా మార్చుకున్నారు.

Ranveer2.jpg

ఇటీవల  దీపిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘రణ్‌వీర్‌కు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలతో మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసుకోబోయే ఆ క్షణం కోసం  ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాం. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎంతో క్రమశిక్షణతో, వినయంగా పెంచారు. రణ్‌వీర్‌ కూడా ఇలాంటి వాతావరణంలోనే పెరిగాడు. అందుకే మేమూ మా పిల్లల్ని సెలబ్రిటీ  ేస్టటస్‌తో సంబంధం లేకుండా సాధారణంగా పెంచాలనుకుంటున్నాం. మంచి విలువల్ని నేర్పించాలనుకుంటున్నాం’ అని అన్నారు.

Ranveer.jpg

ఇటీవల జరిగిన ‘కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 8’లో ఈ జంట పాల్గొన్నారు. వాళ్ల పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు దీప్‌వీర్‌. గతేడాది జవాన్ సినిమాతో  హిట్‌ అందుకున్న దీపికా ఈ ఏడాది హిందీలో 'ఫైటర్‌', 'సింగం ఎగైన్' చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న పాన్  ఇండియా చిత్రం 'కల్కి 2898 ఎడీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:28 AM