RGV: సల్మాన్‌లో చావు భయం..

ABN , Publish Date - Oct 15 , 2024 | 03:26 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకను చంపాడన్న విషయంలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కొన్నిసార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్స్ అకౌంట్‌లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంతకీ వర్మ ఏం ట్వీట్ చేశారంటే..

Lawrence Bishnoi and Salman Khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) 1998లో కృష్ణ జింకను చంపాడన్న విషయంలో లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే కొన్నిసార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీనిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎక్స్ అకౌంట్‌లో షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపింది 1998లో. ఇప్పుడు 30 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi) కేవలం అప్పుడు ఐదేళ్ల వయసున్న పిల్లాడు. అలాంటి వాడు ఓ జింక కోసం 25 ఏళ్లుగా ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నాడా..! నిజంగా ఇది ఆ జంతువుపై ఉన్న విపరీతమైన ప్రేమా లేక దేవుడు ఆడుతున్న వింత నాటకమా? అంటూ వర్మ ట్వీట్‌లో ప్రస్తావించాడు.

Also Read- Shruthi Haasan: అడివి శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ కారణమా..


‘‘గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఓ లాయర్ ఓ జింకను చంపిన నేరానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ సూపర్ స్టార్‌ను హత్య చేయాలని చూస్తున్నాడు. దీనికోసం తాను ఫేస్‌బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్న 700 మంది గ్యాంగ్ సభ్యులకు అదేశాలు ఇస్తున్నాడు. అదే స్టార్‌కు సన్నిహితుడైన ఓ రాజకీయ నాయకుడిని కూడా చంపాలని అనుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అతడు ప్రభుత్వ రక్షణలో ఓ జైల్లో ఉన్నాడు. అతని అధికార ప్రతినిధి విదేశాల నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే స్టోరీని ఎవరైనా బాలీవుడ్ రైటర్ రాసి ఉంటే.. ఎప్పుడూ లేనంతగా నమ్మశక్యం కాని, హాస్యాస్పద స్టోరీ రాసినందుకు అతన్ని కొట్టేవారేమో’’ అని ఆర్జీవీ మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.


Salman.jpg

1998లో సల్మాన్ ఖాన్ అప్పట్లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టపరంగా ఈ కేసులో సల్మాన్ కొద్ది రోజుల శిక్ష అనంతరం.. అతనికి ఫేవర్‌‌గా తీర్పు వచ్చింది. కానీ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికీ సల్మాన్‌ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. దీంతో ఈ కేసు‌ ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. సిద్దిఖీ హత్యతో సల్మాన్‌లోనూ చావు భయం‌ నెలకొందనే‌ ప్రచారం ఊపందుకుంది. సల్మాన్ ప్రస్తుతం ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నారు.

Also Read- Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్.. ఎగిరే గుర్రంపై చిరు

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 15 , 2024 | 03:40 PM