Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

ABN , Publish Date - Sep 30 , 2024 | 10:34 AM

భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ . తాజాగా ఈ అవార్డ్ బాలీవుడ్ లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని వరించింది. వివరాల్లోకి వెళితే..

Mithun Chakraborty

భారతదేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dada Saheb Phalke). ఈ అవార్డును పొందడం అంటే నటీనటులకు వారి జన్మ సార్థకమైనట్లే. అలాంటి ఫీలింగ్ ఈ అవార్డు పొందిన వారికి ఉంటుంది. తాజాగా ఈ అవార్డ్ బాలీవుడ్ విలక్షణ నటుడు, లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty)ని వరించింది. ఆయన ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా అధికారికంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్టోబర్ 8న జరగనున్న నేషనల్ అవార్డ్స్ ప్రజంటేషన్ ఈవెంట్‌లో ఈ పురస్కారాన్ని మిథున్ చక్రవర్తి అందుకోనున్నారు. మిథున్ చక్రవర్తి ఈ అవార్డుకు ఎంపికైనట్లుగా తాజాగా కేంద్ర, సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో బాలీవుడ్‌లో సంబరాలు మొదలయ్యాయి.

Also Read- Aishwarya Lekshmi: నన్ను సింగిల్‌గా ఉండనివ్వరా..

లెజండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి విషయానికి వస్తే.. 1950లో ఆయన కోల్‌కతాలో జన్మించారు. 1976లో ఆయన నటుడిగా ‘మృగాయ’ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు. విశేషం ఏమిటంటే తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలలో ఆయన నటించి స్టార్ యాక్టర్‌గా మారారు. ‘బన్సారీ’, ‘అమర్‌దీప్‌’, ‘సాహాస్‌’, ‘వాంటెడ్‌’, ‘బాక్సర్‌’, ‘త్రినేత్ర’, ‘దుష్మన్‌’, ‘దలాల్‌’, ‘భీష్మ’, ‘సుల్తాన్‌’, ‘గురు’, ‘కిక్‌’, ‘బాస్‌’, డిస్కోడాన్సర్‌ వంటి ఎన్నో చిత్రాలు ఆయనని స్టార్ నటుడిని చేశాయి.


Mithun-Chakraborty.jpg

హిందీతో పాటు బెంగాలీ, కన్నడ, ఒరియా, భోజ్‌పురి, తెలుగు చిత్రాల్లోనూ ఆయన నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘గోపాల గోపాల’ సినిమాలో స్వామిజీగా ‘థ్యాంక్యూ’ అంటూ తన విలక్షణ నటనతో తెలుగు వారికి సుపరిచితమయ్యారు. ఆ తర్వాత ‘మలుపు’ అనే చిత్రంలోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను పలకరించారు. మిథున్ పేరు వినగానే గుర్తొచ్చే పాట ‘ఐ యామే డిస్కో డాన్సర్‌’. ఈ పాటతో దేశవిదేశాలలో ఆయన గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు పద్మభూషణ్‌ అవార్డును కేంద్రం అందజేసింది. ఆ వెంటనే ఇప్పుడు ‘దాదా సాహెబ్ ఫాల్కే’కు సెలక్ట్ చేసి.. బాలీవుడ్ అలాగే ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా మిథున్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read- Sai Durgha Tej: మేనమామల దారిలో సాయి దుర్గ తేజ్.. తగ్గేదేలే

Also Read- Prakash Raj: గుడికెళ్లిన ప్రకాష్ రాజ్.. ఫ్యాన్స్ ఫైర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2024 | 01:32 PM