Ananya Panday: నటన రాకుంటే అంతటితో ఆగిపోయేదాన్ని!

ABN , Publish Date - Aug 18 , 2024 | 10:30 AM

ఈ బాలీవుడ్‌ బ్యూటీ కథానాయికగానే కాదు పలు బ్రాండ్ల అంబాసిడర్‌గా కూడా బిజీనే. ఆమే అనన్య పాండే (Ananya panday). తొంభైల్లో బాలీవుడ్‌లో వెలుగొందిన నటుడు చుంకీ పాండే (Chunki panday) కూతురీమె. అనన్య పాండే గురించి కొన్ని విశేషాలు

ఈ బాలీవుడ్‌ బ్యూటీ కథానాయికగానే కాదు పలు బ్రాండ్ల అంబాసిడర్‌గా కూడా బిజీనే. ఆమే అనన్య పాండే (Ananya panday). తొంభైల్లో బాలీవుడ్‌లో వెలుగొందిన నటుడు చుంకీ పాండే (Chunki panday) కూతురీమె. అనన్య పాండే గురించి కొన్ని విశేషాలు..

అనన్య పాండేకి పెద్దగా హిట్స్‌ లేవు. అయినా సరే ఈ సినిమా నేపథ్యమున్న ఈ బాలీవుడ్‌ భామ ఎక్కడా తగ్గట్లేదు. ముఖ్యంగా ఆమెకి సోషల్‌ మీడియాలో ఉండే హవా అంతా ఇంతా కాదు. రెండున్నర కోట్ల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. చిన్ననాటి ఫొటోలనుంచి.. ఎండోర్స్‌మెంట్స్‌ విశేషాలు, ప్రయాణాలు, వ్యక్తిగత జీవితాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటుంది. బాలీవుడ్‌ కథానాయికగానే ట్యాగ్‌ వేసుకోవటానికి ఆమె ఇష్టపడుతుంది.

Ananya-panday.jpg

వారినుంచే నేర్చుకున్నా..

అనన్యపాండే తండ్రి నటుడు. ఇక తల్లి భావన ఎంటర్‌ప్రూనర్‌. ‘ఏ రిలేషన్‌షిప్‌ అయినా నిలబడాలంటే వారి మధ్య స్నేహం ఉండాలి. అమ్మానాన్నలను చూస్తే ప్రేమ, పెళ్లి గొప్పతనం అర్థం అవుతుంది. మా అమ్మమ్మ,తాతయ్య.. ఇలా పెద్దవారి నుంచి ఎలా ఉండాలో నేర్చుకున్నా. వారిదగ్గరే  స్ట్రాంగ్  మెంటాలిటీ ఏర్పడింది. నా చెల్లెలు రైసాతో చిన్నప్పుడు భలే గొడవపడేదాన్ని. ఇప్పుడు తనే మంచి స్నేహితురాలైంది. స్టార్స్‌కి చప్పట్లు కొట్టేవాళ్లెక్కువ. నిజమైన విషయాలు తెలీవు. నా చెల్లెలు మొఖం మీదనే చెబుతుంది. ఇకపోతే అమ్మానాన్న కూడా అంతే. చిన్నప్పటి నుంచి ఒకేలా పెంచారు మా ఇద్దరినీ. ఏదైనా సినిమా బాగలేకున్నా మా పేరెంట్స్‌ క్రిటిక్స్‌ అవతారమెత్తుతారు. నేను యాక్టింగ్‌లో ప్రూవ్‌ చేసుకుంటే ప్రశంసిస్తారు. ఇట్లాంటి వాతావరణంలో ఉన్నా కాబట్టే హాయిగా ఉన్నా.

Ananya-panday-3.jpg

సులువుగా నటినయ్యాను..

‘నాలుగేళ్ల వయసులో ధీరుభాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చేర్పించారు. సుహానా ఖాన్‌(షారుఖ్‌ ఖాన్‌ కూతురు), షనయా కపూర్‌(సంజయ్‌ కపూర్‌ కూతురు).. నా స్నేహితులే. వారితో కలిసి చదివా. మేం ఆరుమంది గ్యాంగ్‌. ఇప్పటికీ స్కూల్‌మేట్స్‌ నా స్నేహితులు. వారి దగ్గర పాపులర్‌ హీరోయిన్‌ అనే గర్వం నాకుండదు. నేను హీరోయిన్‌ అని వారు గర్వంగా చెబుతారు. ఇప్పటికీ ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది. కొత్తగా ఉండటం.. కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం. ఫ్యాషన్‌ వాల్డ్‌ అంటే పిచ్చి. ఒకసారి ఇటలీలో ఫ్యాషన్‌ షూట్‌కు వెళ్లాను. ఆ షూట్‌లో పాస్తా బాగా లాగించేదాన్ని. అప్పుడే కరణ్‌ జోహార్‌ గారి నుంచి పిలుపొచ్చింది. ఆ చిత్రమే ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’. సినిమా నేపథ్యం ఉండటం వల్ల ఈ అవకాశం వచ్చింది. అయితే నటన రాకుంటే అంతటితో ఆగిపోయేదాన్ని కదా! ప్రతిభ ఉందని అవకాశం ఇచ్చారు. అలా తొలి చిత్రానికే ఫిల్మ్‌ఫేర్‌లో బెస్ట్‌ ఫిమేల్‌ డెబ్యూట్‌ అవార్డు వచ్చింది. ఇక్కడ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లాంచింగ్‌కే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పని చేయాల్సిందే’ అంటుంది అనన్య.

Updated Date - Aug 18 , 2024 | 10:30 AM