OTT: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ 18 ఓటీటీలు బ్యాన్
ABN , Publish Date - Mar 14 , 2024 | 03:15 PM
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రముఖంగా చలామణిలో ఉన్న దాదాపు 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను, సోషల్ మీడియాలను నిషేదిస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రముఖంగా చలామణిలో ఉన్న దాదాపు 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను, సోషల్ మీడియాలను నిషేదిస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశంలో వివరాలు వెళ్లడించారు. అయితే గతంలోనే అశ్లీల వైబ్‌సైట్లను బ్యాన్ చేసిన ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయంతో ఆ పరిశ్రమపై భారీ దెబ్బే తగలనుంది.
దీంతో ఉన్నఫలంగా Uncut Adda, Prime Play, Nuefliks, X Prime, Dream Films, Neon X VIP, MoodX, Tri Flicks, Xtramood, Chikooflix, Hot Shots VIP, Mojflix, Besharams, Voov, Fugi, Rabbit, Yessma, Hunters వంటి 18 ఓటీటీ సంస్థలతో పాటు వీటికి లింకై ఉన్న 19 వెబ్సైట్లు, 10 యాప్‌లు, 57 సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్లాక్‌లిస్టులో చేర్చుతూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు (గురువారం) నిర్ణయం తీసుకుంది. అంతేగాక అవి బయట కనిపించకుండా రిస్ట్రిక్ట్ చేసింది.
గడిచిన ఐదారేండ్లలో స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకం రెట్టింపైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా నెమ్మదిగా ఓటీటీ బాట కూడా పట్టారు. ఇక కరోనా అనంతరం అశ్లీల, అసభ్య కంటెంట్‌లు కూడా యాప్‌ల రూపంలో ఓటీటీలోకి వచ్చేయడమే కాక తమకంటూ ఓ ప్రత్యేక ఇండస్ట్రీని నిర్మించుకుని దొంగచాటుగా వ్యవహరాలు నిర్వహిస్తున్నాయి. మనకు తెలిసి ఆల్ట్ బాలాజీ (Alt Balaji), ఉల్లు (Ullu), కుకూ వంటి రెండు మూడు మాత్రమే అధికారికంగా ఈ అశ్లీల వీడియో సిరీస్‌లను ప్రసారం చేస్తుండగా, అనధికారికంగా దాదాపు 40 పైనే యాప్‌లు నడుస్తున్నాయంటే పరిస్తితి ఎలా ఉందో తెలుస్తుంది.
అయితే.. తాజాగా నిర్వహించిన సమావేశంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ మూట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నియమ నిబంధనలతో పాటు నైతిక ప్రమాణాలను పాటించాలని, సమాజాన్ని పెడదారి పట్టించే అశ్తీల చిత్రాల చిత్రీకరణ, ప్రసారాలు నిలిపివేయాలని లేకుంటే భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారమే ఓటీటీ యాప్‌లపై ఈ నిషేధ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా తాజాగా బ్యాన్ చేయబడ్డ సంస్థల లిస్టులో ఆల్ట్ బాలాజీ (Alt Balaji), ఉల్లు (Ullu) యాప్‌లు లేక పోవడంపై సర్వత్రా అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదీగాక ప్రస్తుతం బ్యాన్ చేయబడ్డ సంస్థల సబ్‌స్క్రిప్షన్స్ కన్నా ఉల్లు, ఆల్ట్ యాప్‌లకు ఉన్న సబ్‌స్క్రైబర్లే చాలా ఎక్కువగా మిలియన్లలో ఉండడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయంలో ద్ద చర్చే నడుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం వారి పార్టీకి అనుకూలంగా ఉన్న ఆ యాప్‌లను డెవలప్ చేసుకునేందుకే అని ఓ రేంజ్‌లో విమర్శిస్తున్నారు.