Sharvari: సినిమా కోసం.. బోల్డ్ బ్యూటీ క‌స‌ర‌త్తులు

ABN , Publish Date - Jul 15 , 2024 | 06:55 PM

ఈ మ‌ధ్య హిందీ చిత్ర సీమ‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు శార్వ‌రి. త‌క్కువ చిత్రాలు చేసినా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌న బోల్డ్ ఫొటోషూట్ల‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

sharvari

ఈ మ‌ధ్య బీ టౌన్‌లో ఎక్కువ‌గా వినిపిస్తున్న, ట్రెండింగ్‌లో ఉంటున్న న‌టి శార్వరి (Sharvari). తాజాగా త‌ను న‌టించిన హిందీ చిత్రం ముంజ్య (Munjya) ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే కాక రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టి సంచ‌ల‌నం సృష్టించింది. దీంతో అమ్మ‌డి పేరు మ‌రింత‌గా ప్రాచుర్యంలోకి వ‌చ్చింది. రెయిజింగ్‌ స్టార్‌గా గుర్తింపును తెచ్చుకున్న‌ది.

sharvari

ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో బంఫ‌రాఫ‌ర్ ప‌ట్టేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యష్‌రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)గా రూపొందించ‌నున్న అల్ఫా (Alpha) సినిమాలో ఓ ప్ర‌ధాన పాత్ర‌కు ఎంపికైంది. ఇప్ప‌టికే ఈ మూవీలో అలియా భ‌ట్ (Alia Bhatt) ఓ క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా అల్రేడీ షూటింగ్‌లో జాయిన్ అయింది.

sharvari

ఈ నేప‌థ్యంలోనే శార్వరి తన కెరీర్‌ బెస్ట్ మూవీ ఆల్పా షూటింగ్‌కి సిద్ధమవుతూ ఈ రోజు సోషల్‌ మీడియాలో హాట్‌ మండే మోటివేషన్ అంటూ త‌ను సినిమా కోసం చేస్తున్న క‌స‌ర‌త్తుల‌ను గురించి వివ‌రిస్తూ ఓ పోస్ట్ చేసింది.


sharvari

అయితే శార్వరి చేసిన‌ పోస్టు తాను చేస్తున్న వర్కవుట్స్ గురించి చెప్పడమే కాకుండా తన ఫ్యాన్స్ ని, జనాలను కూడా మోటివేట్‌ చేసేలా ఉంది. సోమవారం రోజు వర్కవుట్స్ ని అస్సలు మిస్‌ కావద్దంటూ ఆమె పెట్టిన పోస్టుకు లైకుల పరంపర కొనసాగుతోంది. అంతే కాదు, ప్రతి రోజూ వర్కవుట్‌ చేస్తే ఎంత ఫిట్‌గా ఉంటారో ఆమె పోస్ట్ చేసిన పిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. 

sharvari

ఇదిలాఉండ‌గా శార్వరి ప్రస్తుతం నిఖిల్‌ అద్వానీ ద‌ర్శ‌క‌త్వంలో జాన్ అబ్ర‌హంకు జోడీగా వేదా చిత్రంలో నటిస్తోండ‌గా తాజాగా త‌ను న‌టించ‌బోతున్న ఆల్ఫా (Alpha) చిత్రానికి ది రైల్వే మెన్‌ ఫేమ్‌ శివ్‌ రవైల్ (Shiv Rawail) దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

sharvari

అంతేకాదు హృతిక్ రోష‌న్ ( Hrithik Roshan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న వార్ 2లో ఎన్టీర్ (Jr NTR) కు జోడీగా శార్వరి (Sharvari) న‌టిస్తోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

sharvari

Updated Date - Jul 15 , 2024 | 07:22 PM