Arshad Warsi: క‌ల్కిలో ప్ర‌భాస్ లుక్‌ జోక‌ర్‌లా ఉంది.. నేనెంతో ఊహించుకున్నా

ABN , Publish Date - Aug 18 , 2024 | 08:51 PM

ఇటీవ‌లే క‌ల్కి మూవీ చూశాన‌ని నాకు న‌చ్చ‌లేద‌ని, అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌తో పోలిస్తే.. ప్ర‌భాస్ పాత్ర తేలిపోయింద‌న్నారు. ఆయ‌న లుక్‌ జోకర్‌లా ఉందని బాలీవుడ్ న‌టుడు అర్షద్ వార్సీ అన్నారు. ఇప్పుడు ఈ మాట‌లు సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

arshad

మున్నాభాయ్ ఎంబీబీఎస్‌, గోల్‌మాల్‌, వంటి సూప‌ర్ హిట్ బాలీవుడ్ చిత్రాల‌తో పాటు అసుర్ వంటి హిందీ వెబ్ సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విశేష అభిమానుల‌ను సంపాదించుకున్న న‌టుడు అర్షద్‌ వార్సీ (Arshad Warsi). ఆయ‌న త‌రుచూ ఎదో ఓ అంశంలో వివాదంలో ఉంటూ వార్త‌ల్లో నిలుస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల సినిమా అవ‌కాశాలు కూడా చాలా త‌గ్గాయి. అయితే తాజాగా ఆయ‌న ఓ ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ (Prabhas)పై చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

warsi.jpg

ఆయ‌న ఓఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవ‌లే క‌ల్కి (Kalki 2898ad) మూవీ చూశాన‌ని నాకు న‌చ్చ‌లేద‌ని, అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర‌తో పోలిస్తే.. ప్ర‌భాస్ పాత్ర తేలిపోయింద‌న్నారు. అమితాబ్‌ ఈ వ‌య‌సులో ఇలాంటి సినిమాలు చేయ‌డం చూసి ఆశ్చర్యపోయాన‌ని, ఆయ‌న‌లో ఉన్న శక్తిలో కొంచెమైనా ఉంటే మా లైఫ్ సెట్ అయిపోతుందన్నారు. కానీ ప్రభాస్‌ను ఆ సినిమాలో అలా చూస్తున్నప్పుడు బాధగా అనిపించిందని, ఆయ‌న లుక్‌ జోకర్‌లా ఉందని, అయ‌న పాత్ర‌ను అలా ఎందుకు డిజైన్‌ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు. మ్యాడ్‌మ్యాక్స్ సినిమాలో మెల్ గిబ్స‌న్‌లా ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని అశించాన‌న్నారు.


దీంతో అర్షద్‌ వ్యాఖ్యలపై ప్రభాస్‌ అభిమానులు తీవ్ర అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌భాస్ (Prabhas) ఫ్యాన్స్ అర్షద్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీనే దుయ్య‌బ‌డుతున్నారు. బాలీవుడ్ న‌టుల‌కు సౌత్ స్టార్స్‌పై ఈర్ష్య వల్లే ఇక్క‌డి న‌టుల‌ను చిన్న చూపు చూస్తున్నారంటూ మండి ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా క‌ల్కి (Kalki 2898ad) సినిమాను మాత్రం హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లార‌ని అన్నారు. ఇంకా చాలామంది సౌత్ నుంచి వ‌స్తున్న‌ద‌ర్శ‌కులు బాలీవుడ్ క‌న్నా ముందుంటున్నార‌ని, ధైర్యంగా,క్రియేటివ్‌గా కంటెంట్ బేస్డ్ సినిమాలు జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నార‌న్నారు. చాలా మ‌జా వ‌స్తుంద‌న్నారు. యానిమ‌ల్ సినిమా చాలా ఫ్యాసినేటెడ్‌గా తీశార‌న్నారు. అన్‌ఫిల్ట‌ర్ బై స‌మ్దిష్ ఛాన‌ల్‌తో ఆయ‌న‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆ వీడియోలో 2 గంట‌ల 34 నిమిషాల నుంచి 2 గంట‌ల 36 నిమిషాల వ‌ర‌కు క‌ల్కి, మ‌రో ఒక‌టి రెండు చిత్రాల‌పై త‌న అభిప్రాయాన్ని తెలిపాడు.

Updated Date - Aug 18 , 2024 | 08:51 PM