Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్
ABN , Publish Date - Oct 17 , 2024 | 01:59 PM
కృష్ణ జింకని వేటాడిన కేసులో కోర్ట్ సల్మాన్ ఖాన్‌కి ఉపశమనం ఇచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు. ఈ క్రమంలోనే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని తాజాగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందినవాడిగా తెలుస్తోంది.
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba siddique) హత్య తర్వాత బాలీవుడ్‌లో హై అలర్ట్ ఏర్పడింది. ఇప్పటికే స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కి ముంబై పోలీసులు భద్రత పెంచారు. అలాగే తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ ఖాన్‌కి చావే అంటూ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoi Gang) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీని కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ లిస్ట్‌లోకి చేర్చింది. అయితే సల్మాన్ ఇంటి దగ్గర కాల్పులు జరిపిన ఓ వ్యక్తిని తాజాగా పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందినవాడిగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
Nidhhi Agerwal: ఒకే రోజు.. రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాల్లో..
కృష్ణ జింక (Black buck) ని వేటాడిన కేసులో కోర్ట్ సల్మాన్ ఖాన్‌కి ఉపశమనం ఇచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్ మాత్రం వదలడం లేదు. బిష్ణోయ్ లకు ఎంతో పవిత్రమైన కృష్ణ జింక ను వేటాడినందుకు సల్మాన్‌ని వదిలే ప్రసక్తే లేదని బిష్ణోయ్ గ్యాంగ్ ఎప్పుడో స్టేట్మెంట్ కూడా విడుదల కూడా చేసింది. ఇటీవల సల్మాన్ ఆప్త మిత్రుడు బాబా సిద్దిఖీని హతమార్చి నెక్ట్స్ నువ్వే అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే గతంలోనూ సల్మాన్ మర్డర్‌కి ప్లాన్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి పనేవాల్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌కి వెళ్తున్న క్రమంలో కాల్పులు జరిపారు. అప్పటికి సల్మాన్ అక్కడ నుంచి బయలుదేరటంతో ఎవరికీ ఏ ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని మాత్రం పోలీసులు ఈరోజు హర్యానాలో పట్టుకున్నారు. ఆ వ్యక్తి బిష్ణోయ్ గ్యాంగ్‌కి చెందిన సుక్ఖాగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సులభంగా ఆ వ్యక్తిని పట్టుకోగలిగారు.
మరోపక్క బిగ్ బాస్ టైటిల్ విన్నర్, స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూకీని కూడా బిష్ణోయ్ వర్గం టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు మునావర్ ఫరూఖీని అంతమొందించాలని సెప్టెంబర్‌లోనే బిష్ణోయ్ గ్యాంగ్ ఫ్లాన్ చేసింది. కానీ.. తృటిలో అతడు తప్పించుకున్నట్లుగా తాజా విచారణలో వెల్లడైంది. మునావర్ ఫరూఖీని మట్టుబెట్టి లారెన్స్ బిష్ణోయ్ తనకు తానుగా హిందూ అండర్ వరల్డ్ డాన్ గా ముద్ర వేయించుకోవాలని అనుకున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. మునావర్ ఫరూఖీ ముంబై నుంచి విమానంలో ఢిల్లీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్నాడు. అదే విమానంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు అనుచరులు కూడా ఉన్నారు. మునావర్ కదలికలను గమనిస్తూ వెంబడించారని.. ఢిల్లీలో ఫరూఖీ బస చేసే హోటల్లోనే గదులు కూడా బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడిపై దాడికి ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి పోలీసులకు నివేదిక అందడంతో పోలీసులు రక్షించి ముంబైకి తరలించినట్లుగా నిఘా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఫరూఖీకి సైతం పోలీసులు భద్రత కొనసాగిస్తున్నారు.