Big Boss: వార్నింగ్‌ల మధ్యే బిగ్‌బాస్‌కి సల్మాన్.. సెక్యూరిటీ ఎలా ఉందంటే
ABN , Publish Date - Oct 18 , 2024 | 05:01 PM
సల్మాన్ బిగ్‌బాస్ షూటింగ్‌కి వెళ్తారా లేదా అనే చర్చ మొదలైంది. ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. సల్మాన్ బిగ్‌బాస్‌కి హాజరయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సల్మాన్ ఖాన్ ఆప్త మిత్రుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (Baba siddique) హత్యానంతరం సల్మాన్ (Salman Khan)కు ప్రాణగండం వెంటాడుతుంది. ఇప్పటికే బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌కి పలు వార్నింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముంబై పోలీసులు ఆయనకు భద్రత పెంచారు. మరోవైపు సల్మాన్ బిగ్‌బాస్ షూటింగ్‌కి వెళ్తారా లేదా అనే చర్చ మొదలైంది. ఈ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. సల్మాన్ బిగ్‌బాస్‌కి హాజరయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
హిందీలో బిగ్‌బాస్ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీజన్‌తో బిగ్‌బాస్ 18 సీజన్లు పూర్తి చేసుకుంది. షో ఆరంభమైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ ఎవర్‌గ్రీన్ హోస్ట్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులతో సల్మాన్ బిగ్‌బాస్‌కి హాజరవుతారా అనే సందిగ్థత ఏర్పడింది. తన స్నేహితుడు బాబా సిద్దిఖీ మరణ వార్త విని సల్మాన్ బిగ్‌బాస్ షూటింగ్ మధ్యలో వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ప్రతి శుక్రవారం జరిగే ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ షూట్ కోసం ఆయన బిగ్‌బాస్‌కి వెళ్తున్నారు. దాదాపు 60 మంది సెక్యూరిటీ గార్డుల మధ్య ఆయన షూటింగ్‌లో పాల్గొంటారు. సల్మాన్ కోసం ప్రత్యేకంగా బస ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు సెట్‌కి బయటి వాళ్ళని ఎవరిని అనుమతించడం లేదు. కేవలం స్టాఫ్‌ని మాత్రమే కంప్లీట్ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.
1998లో సల్మాన్ ఖాన్ ‘హమ్ సాథ్ సాథ్ హై’ మూవీ షూటింగ్ సందర్భంగా ఓ కృష్ణ జింకను వేటాడి చంపాడన్న ఆరోపణలు ఉన్నాయి. చట్టపరంగా ఈ కేసులో సల్మాన్ కొద్ది రోజుల శిక్ష అనంతరం.. అతనికి ఫేవర్‌గా తీర్పు వచ్చింది. కానీ జింక హత్య కేసును మనసులో పెట్టుకున్న లారెన్స్ బిష్ణోయ్ ఇప్పటికీ సల్మాన్‌ను చంపాలని చూస్తున్నాడు. సల్మాన్‌కు సన్నిహితుడైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీని కాల్చి చంపారు. దీంతో ఈ కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సల్మాన్ పైనా ఇప్పటికే హత్యాయత్నం జరిగింది. సల్మాన్ ప్రస్తుతం ‘సికిందర్’ సినిమాలో నటిస్తున్నారు.