Atlee: 'యానిమల్'తో మరో సినిమాని పోల్చిన స్టార్ డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫైర్

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:16 PM

Atlee: ‘జవాన్‌’తో బాలీవుడ్‌ పాపులర్‌ అయ్యారు కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ. ప్రస్తుతం ఆయన ‘బేబీ జాన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Atlee comments on animal

'రాజా రాణి' సినిమాతో డెబ్యూ చేసి వీపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ డైరెక్టర్ 'అట్లీ'. తర్వాత 'తేరి'(తెలుగులో పోలీసోడు), మెర్సల్, బిగిల్, జవాన్ వంటి చిత్రాలతో దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నాడు. షారుఖ్ ఖాన్ ‘జవాన్‌’తో (Jawan) బాలీవుడ్‌ లో ఫుల్ పాపులర్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన 'తేరి' బాలీవుడ్ రీమేక్ ‘బేబీ జాన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దీంతో పలువురు ఫ్యాన్స్ ఆయనపై ట్రోల్ కామెంట్స్ పెడుతున్నారు.


వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘బేబీ జాన్‌’. కాలీస్‌ దీన్ని తెరకెక్కిస్తుండగా. వామికా గబ్బీ, జాకీష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అట్లీ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అట్లీ హీరో వరుణ్ ధావన్ తో కలిసి వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'మేము మరో సూపర్ స్టార్ ని తయారు చేస్తున్నం. రణ్‌బీర్ కపూర్‌కి యానిమల్ సినిమా ఎలాగో, వరుణ్ ధావన్‌కి 'బేబీ జాన్' సినిమా ఆలా" అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఒరిజినల్ కంటెంట్ తో వచ్చిన 'యానిమల్'కి రీమేక్ 'బేబీ జాన్' పోలిక ఏంటని పలువురు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వాస్తవానికి 'బేబీ జాన్' కంటెంట్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. ఈ నేపథ్యంలో అట్లీ కామెంట్స్ అతిగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 05:25 PM