AR Rahman: రెహ్మాన్ డైవర్స్‌లో ట్విస్ట్.. కారణమిదేనా
ABN , Publish Date - Nov 21 , 2024 | 07:29 AM
ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఏఆర్ రెహ్మాన్ డైవర్స్‌లో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రెహ్మాన్‌కి ఒక యువతితో ఉన్న సంబంధమే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసిందంటే..
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ తన 29 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతూ విడాకులు తీసుకున్న ఈ విషయం తెలిసిందే. అయితే డైవర్స్ లో కొత్త ట్విస్ట్ తెర పైకి వచ్చింది. రెహ్మాన్ టీమ్ సభ్యురాలి వల్లే ఈ విడాకులు తీసుకున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ టీమ్ సభ్యురాలు ఎవరు? ఆమె చేసిందంటే..
గత కొన్నేళ్లుగా ఏఆర్ రెహ్మాన్ టీమ్‌లో మోహిని అనే ఆర్టిస్ట్ పనిచేస్తుంది. ఆమెతో రెహ్మాన్ కి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె రెహ్మాన్ డైవర్స్ తీసుకున్న కొన్ని గంటల్లోనే తాను ఆమె భర్తతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేస్తూ.. "ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. భారమైన హృదయంతో, నా భర్త మార్క్ నేను విడిపోయామని ప్రకటిస్తున్నాను. మా ఇద్దరి పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాము" అంటూ రాసుకొచ్చింది. దీంతో ఏఆర్ రెహ్మాన్ డైవర్స్కి మోహినితో ఉన్న సంబంధమే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. గంట వ్యవధిలోనే ఇద్దరు విడాకులు తీసుకోవడం ఈ చర్చకి కారణమైంది.
ఇక రెహ్మాన్, సైరా బాను 1995, మార్చి 12న పెద్దల సమక్షంలో నిఖా చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఖతీజా, రహీమాతో పాటు ఒక అబ్బాయి అమీన్ ఉన్నారు. మరికొన్ని నెలల్లో 30 ఏళ్ల వివాహ బంధంలోకి అడుగుపెట్టాల్సిన జంట అనూహ్యంగా విడాకులు తీసుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.