IIFA Awards: రెండో రోజు ఐఫా.. ‘యానిమల్‌’దే హవా

ABN , Publish Date - Sep 29 , 2024 | 01:09 PM

ఇండియన్ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమం వైభవంగా  జరిగింది.

ఇండియన్ సినిమా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) (IIFA Awards) అవార్డుల కార్యక్రమం వైభవంగా  జరిగింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో తొలిరోజు దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు, సినీ ప్రముఖులకు అవార్డులు అందించగా, రెండో రోజు బాలీవుడ్‌ సినిమాలకు, నటీనటులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ‘యానిమల్‌’ (Animal) సినిమా ఈ అవార్డు వేడుకల్లో సత్తా చాటిందిఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ విలన్‌,ఉత్తమ సంగీతం, ఉత్తమ లిరికల్స్‌, ఉత్తమ గాయకుడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది. ‘జవాన్‌’ (Jawan) చిత్రానికి షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.

ఐఫా 2024 విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: యానిమల్‌
ఉత్తమ నటుడు: షారుక్‌ ఖాన్‌ (జవాన్‌)
ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే)
ఉత్తమ దర్శకుడు: విదు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌)
ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)
ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ)
ఉత్తమ విలన్‌: బాబీ దేవోల్‌ (యానిమల్‌)
ఉత్తమ కథ: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ
ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్‌
ఉత్తమ సంగీతం: యానిమల్‌
ఉత్తమ లిరికల్స్‌: యానిమల్‌ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్‌)
ఉత్తమ గాయని: శిల్పారావు (చెలియా-జవాన్‌)
ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా: జయంతిలాల్‌, హేమా మాలిని
అచీవ్‌మెంట్ ఆన్‌ కంప్లీటింగ్‌ 25 ఇయర్స్‌ ఇన్‌ సినిమా : కరణ్‌ జోహార్‌

Pawan Kalyan: పవన్‌ గానం.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ


Updated Date - Sep 29 , 2024 | 02:25 PM