Amitabh Bachchan: వెండితెర 'సర్కార్'కి 82 ఏళ్ళు

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:39 PM

కెరీర్‌లో చేసిన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న వెండితెర 'సర్కార్' అమితాబ్ బచ్చన్ 82వ పుట్టిన రోజు నేడు.

Amithab bachhan

సినీరంగంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా కొన్ని రోజులు నిలదొక్కుకోవడమే పెద్ద సవాల్ అయితే ఆ సవాళ్ళను ఎదురుకొని నిలబడి సినీ ఇండస్ట్రీనే ఏలడం ఇద్దరు మెగాస్టార్‌లకే సాధ్యమైంది. ఇటు టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి అటు బాలీవుడ్ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్. జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులు ఎదురుకొని స్వయంకృషితో వెండితెరకు రారాజులుగా మారారు. కెరీర్‌లో చేసిన మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న వెండితెర 'సర్కార్' అమితాబ్ బచ్చన్ 82వ పుట్టిన రోజు నేడు.


ఏజ్‌లో 82కు చేరుకున్న బచ్చన్ ఇప్పటికీ యంగ్ హీరోలకంటే యాక్టివ్‌గా ఉంటూ అని భాషల్లో సినిమాలతో పాటు టీవీ షో‌లు హోస్ట్ చేస్తున్నారు. ఇటీవల కల్కి సినిమాతో మన కళ్ళు చెదరగొట్టే యాక్షన్ స్టంట్స్ చేసిన బిగ్ బీ తాజాగా రజినీకాంత్ 'వెట్టయాన్' లోను అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రఖ్యాత హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ కి 1942 అక్టోబర్ 11న అలహాబాద్‌లో అమితాబ్ జన్మించారు. విప్లవ కవి అయిన అమితాబ్ తండ్రి మొదట ఆయనకు 'ఇంక్విలాబ్' అని నామకరణం చేశాడట. కానీ.. కాలక్రమేణా ఆ పేరును మార్చేశారు. సినిమా పిచ్చితో ఆయన కేవలం డ్రైవింగ్ లైసెన్స్ తో ఇల్లు విడిచి ముంబై వచ్చారు. చూడటానికి మోడల్ లుక్‌లో ఉన్న ఆయనకీ మొదట్లో యాడ్స్ చేసే అవకాశమొచ్చింది. కేవలం నటనపై ఉన్న పిచ్చి ఎక్కడ డిస్ట్రాక్ట్ అవుతుందోన్నా భయంతో 10,000 రూపాయల ఆఫర్‌ని వదులుకున్నారు. అప్పటికి క్యాబ్ డ్రైవర్‌గా ఆయన జీతం 50 రూపాయలు మాత్రమే. రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి మెరైన్ బీచ్ బెంచీలపై పెద్ద పెద్ద ఎలుకలతో సహజీవనం చేశారు.


1969లో తొలిసారి ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ దర్శకత్వంలో 'సాత్ హిందుస్తానీ' సినిమాలో ఏడుగురి ప్రధాన పాత్రల్లో ఒక రోల్ చేసి జాతీయ అవార్డు సాధించాడు. అనంతరం బిగ్ బీ యాక్టింగ్ మెస్మరైజ్ అయిన దర్శకులు వరుసపెట్టి సినిమాలు అఫర్ చేశారు. వరుసగా పర్వానా, గుడ్డీ, బాంబే టు గోవా, జంజీర్, లావారిస్, కాలా పత్తర్, దీవార్, షోలే, హమ్ వంటి సినిమాల్లో నటించి తిరుగులేని స్టార్ డమ్ సాధించారు. పుణె టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో జయ బాధురిని తొలిసారి కలిసిన బచ్చన్ ఆమెతో జంజీర్ సినిమా చేశారు. అనంతరం ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెళ్లి చేసుకొని శ్వేతానంద, అభిషేక్ బచ్చన్ లకు జన్మనిచ్చారు. టాటా ఇండస్ట్రీస్ అధినేత రతన్ టాటా మరణంతో ఆయన ఈ ఏడాది బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read- Prabhas: ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. ఎప్పుడంటే

Also Read- Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లో స్మోక్‌ చేస్తూ దొరికిన విష్ణుప్రియ‌.. వైర‌ల్‌

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 12:39 PM