Amitabh Bachchan: అస్వస్థతతో ఆస్పత్రిలో అమితాబ్
ABN , Publish Date - Mar 15 , 2024 | 03:02 PM
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు (hospitalized) బీటౌన్ లో టాక్ నడుస్తోంది. ఆయన
బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరినట్లు (hospitalized) బీటౌన్ లో టాక్ నడుస్తోంది. ఆయన కాలిలో క్లాట్ ఉండటం వల్ల యాంజియోప్లాస్టీ చేయబోతున్నారని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
ఇటీవల ఆయన బ్లాగ్‌లో 'కల్కి 2898 ఎడీ’ చిత్రం గురించి అప్‌డేట్ ఇచ్చారు. గొప్ప అనుభూతి కలిగించే చిత్రంగా తీర్చిదిద్దడానికి టీమ్ అంతా కష్టపడుతోందని ఆయన పేర్కొన్నారు. అనుకున్నట్లుగా సినిమా విడుదల అవుతుందని చెప్పారు.