Alia Bhatt - Bobby deol: హోరాహోరీగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:00 PM

ప్రముఖ బాలీవుడ్‌ సంస్థ యశరాజ్‌ ఫిల్మ్స్‌ (yash raj Films)నిర్మిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ (Alpha). శివ్‌ రావేల్‌ (Shiv Ravel) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్‌ (Alia bhatt) శార్వరీ వాఘ్‌ (Sarvari wagh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ సంస్థ యశరాజ్‌ ఫిల్మ్స్‌ (yash raj Films)నిర్మిస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ (Alpha). శివ్‌ రావేల్‌ (Shiv Ravel) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్‌ (Alia bhatt) శార్వరీ వాఘ్‌ (Sarvari wagh) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. ఈ స్పై థ్రిల్లర్లో బాలీవుడ్‌ నటుడు బాబీదేవోల్‌ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తారట. ప్రస్తుతం బాబీ, అలియాభట్‌కు మధ్య భారీ యాక్షన్  సన్నివేశాల చిత్రీకరిస్తున్నారట. హాలీవుడ్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ల సమక్షంలో యుద్థపోరాట సన్నివేశాలను తీస్తున్నట్లు టాక్‌. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో వీటిని చిత్రీకరిస్తున్నట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’లో అలియా మొదటిసారి యాక్షన్‌ సన్నివేశాల్లో నటించారు. ఇప్పుడు ‘ఆల్ఫా’లోని సీన్స్‌ ఆమెను మరో స్థాయికి తీసుకెళ్తాయని మూవీ యూనిట్‌ తెలిపింది.


యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అలియా గూఢచారిగా కనిపించనున్నారు. ఇంతకుముందు చూడని భారీ యాక్షన్‌ సన్నివేశాలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా గురించి అలియా గతంలో పోస్ట్‌ పెడుతూ ‘‘గ్రీకు ్ఘభాషలోని మొదటి అక్షరం మా నినాదం.. ‘ఆల్ఫా’. ఇది అత్యంత వేగమైనది, శక్తిమంతమైనది’’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 04:22 PM