Allu Arjun: నన్ను స్టార్‌ను చేసింది ఆయనే..
ABN , Publish Date - Nov 29 , 2024 | 07:12 PM
పుష్పగా ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం. నన్ను స్టార్‌ను చేసింది ఆయనే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదలలో సింహభాగం ఆయనకే చెందుతుందని అన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ‘పుష్ప-2 ది రూల్’ చిత్ర ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా మేకర్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక అనంతరం, చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. కొచ్చిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. తాజాగా ముంబయ్‌లో గ్రాండ్ ప్రెస్‌మీట్‌ను మేకర్స్ ఏర్పాటు చేశారు.
Also Read- Samantha: సమంత ఇంట్లో విషాదం.. ఆమె తండ్రి మృతి
ఈ కార్యక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విషయంలో నేను థాంక్స్ చెప్పుకోవాల్సింది నిర్మాతలకు. వాళ్లు లేకుంటే, వాళ్ల సపోర్ట్ లేకుండా అసలీ సినిమా సాధ్యపడేది కాదు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో విడుదల చేస్తున్న అనిల్ తడానిజీ, భరత్ భూషణ్‌లకు థ్యాంక్స్. ‘పుష్ప’ చిత్రాన్ని కోవిడ్ టైమ్‌లో చాలా ఛాలెంజ్‌లు ఫేస్ చేసి విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర సాంకేతికనిపుణులందరికీ కృతజ్ఞతలు. నా చిన్ననాటి స్నేహితుడు, నా కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే ‘పుష్ప-2’ నుంచి మరో సూపర్ సాంగ్ రాబోతుంది. ఈ పాటతో దేవి మ్యాజిక్ ఏంటో మరోసారి అందరికీ తెలుస్తుంది. అందరి హృదయాలను హత్తుకునే పాట అది. ఫహాద్ ఫాజిల్‌తో పనిచేయడం ఎంతో గొప్పగా వుంది. శ్రీలీల, రష్మికలతో పనిచేయడం ఎంతో హ్యపీ. గత నాలుగు సంవత్సరాలుగా రష్మికతో కలిసి పనిచేశాను. ఆమెతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో ఎనర్జీని ఇచ్చింది. ఈ ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కావాలి అనిపించేంతగా రష్మిక గొప్పతనం కనిపిస్తుంది.
నా జర్నీలో దర్శకుడు సుకుమార్‌తో 20 ఏళ్ల ప్రయాణం నడిచింది. పుష్పగా ఈ రోజు నేను హీరోగా ఇలా వున్నానంటే ఆయనే కారణం. నన్ను స్టార్‌ను చేసింది సుకుమారే. నా లైఫ్‌లో అత్యధిక భాగం.. హీరోగా నా ఎదుగుదల ఆయనకే చెందుతుంది. ఈ రోజు ఆయన రాలేదు కానీ ఈ రోజు కూడా చిన్న చిన్న మార్పుల కోసం సినిమాపై ఇంకా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఇంత డబ్బు వస్తుంది.. ఇంత పేరు వస్తుందని లెక్కలు వేసుకోని చేయలేదు. ప్రేక్షకులకు ఓ బెస్ట్ సినిమా ఇవ్వాలి. వాళ్లకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ సినిమా ఇవ్వాలని వర్క్ చేశాం. ఐదు సంవత్సరాలు మా లైఫ్‌లో బెస్ట్ ప్రొడక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. బెస్ట్ సినిమా ఇస్తున్నాం. మేము పుష్ప పార్ట్-1 సాధారణ సినిమాగానే చేశాం. కానీ ప్రేక్షకలు తమ ఆదరణతో గొప్ప సినిమా చేశారు. ఈ రోజు పుష్ప-2 రూపంలో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా చేయడానికి కారణం మీ ఆదరణే. ఈ రోజు ప్రపంచంలోని అందరూ ‘పుష్ప-2’ విడుదలను సెలబ్రేట్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.