Alpha: యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ షూట్‌లో అడుగెట్టిన ఆలియా..

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:56 PM

బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’ షూటింగ్‌ కోసం సెట్స్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆల్ఫా’. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ స్పై యూనివర్శ్‌ మూవీని ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌కి నటి ఆలియా భట్‌ హాజరైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Alia Bhatt in Alpha Sets

బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ (Alia Bhatt) యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ (YRF Spy Universe Film) ‘ఆల్ఫా’ షూటింగ్‌ కోసం సెట్స్‌లో అడుగుపెట్టారు. బాలీవుడ్‌లో అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆల్ఫా’ (Alpha). యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ స్పై యూనివర్శ్‌ మూవీని ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్స్‌కి నటి ఆలియా భట్‌ హాజరయ్యారు. తాజాగా ఆమె సెట్స్‌లో అడుగుపెట్టినట్లుగా తెలుపుతూ కొన్ని ఫొటోలను విడుదల చేశారు. అయితే ఈ ఫిల్మ్‌లో ఆలియా లుక్ ఇదేనంటూ ఇటీవల వైరల్ అయిన వార్తలపై కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Also Read- Siddharth: సిద్ధార్ధ్.. నీ అతి తగ్గించుకుంటే మంచిది..

ఇప్పుడు వైరల్‌ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్‌ కాదు. సినిమాలో ఆమె లుక్‌ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్‌ అవుతోంది. అసలు ఆల్ఫా సెట్స్ నుంచి లుక్‌ లీక్‌ అయ్యే ఛాన్సే లేదు. సెట్‌కి అంతగా భద్రతను కల్పించామని తెలిపింది యూనిట్‌. ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ యష్‌రాజ్‌ స్పై యూనివర్శ్‌గా ఈ ‘ఆల్ఫా’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఆలియా సూపర్‌ ఏజెంట్‌గా నటిస్తారు. శివ రవైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శివ రవైల్‌ ఇంతకు ముందు యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్ ‘ది రైల్వే మెన్‌’ను డైరెక్ట్ చేశారు. భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కిన ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు ఆడియన్స్. (Alia Bhatt Alpha Update)


Alia.jpg

యష్‌రాజ్‌ స్పై యూనివర్శ్‌ గురించి చెప్పుకోవాలంటే ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌3 సినిమాలను తప్పక ప్రస్తావించాల్సిందే. ప్రేక్షకుల్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న సినిమాలవి. ఈ చరిష్మాతోనే ప్రస్తుతం ‘ఆల్ఫా’ను కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం యష్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో స్టార్ హీరోలు హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ‘వార్‌2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 03:56 PM

Alia Bhatt : అల్ఫా గర్ల్‌

Alia Bhatt : నా జీవితానికి వార్దిదరూ చాలా కీలకం!

Alia Bhatt Fire: నాకు అనిపించిందే చేస్తా.. నెపోటిజంపై కామెంట్స్‌

Alia Bhatt: ఆలియా కోరిక.. నెటిజన్ల కౌంటర్‌ ఏంటో తెలుసా?

Alia bhatt : జీవితంలో ఎన్నో సాధించాలంటూ.. ప్రత్యేక శుభాకాంక్షలు!