OTT-Poacher: చూడనివాళ్లు త్వరగా చూసేయండి!

ABN , Publish Date - Feb 25 , 2024 | 04:31 PM

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియాభట్‌ (Alia Bhatt)నిర్మాతగా మారి విజయాన్ని హిట్‌ కొట్టారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి ఆమె ‘పోచర్‌’ (PoCher) వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్  అవుతుంది.

OTT-Poacher: చూడనివాళ్లు త్వరగా చూసేయండి!


బాలీవుడ్‌ అగ్ర కథానాయిక అలియాభట్‌ (Alia Bhatt)నిర్మాతగా మారి విజయాన్ని హిట్‌ కొట్టారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోతో కలిసి ఆమె ‘పోచర్‌’ (Poacher) వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. ఎమ్మీ అవార్డు విన్నర్‌, దర్శకుడు రిచీ మెహతా రూపొందించిన క్రైమ్‌ సిరీస్‌ ఫిబ్రవరి 23 నుంచి అమెజాన్‌లో స్ట్రీమింగ్  అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌కు చక్కని ఆదరణ దక్కుతుంది. ఈ సిరీస్‌ గురించి ఆలియాభట్‌ మాట్లాడుతూ "ఈ వెబ్‌ సిరీస్‌కు ఓటీటీలో చక్కని స్పందన వస్తునందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంటూ తన ఇంట్లో టీవీ ముందు నిలబడి పెంపుడు పిల్లితో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. "పోచర్‌ వెబ్‌ సిరీస్‌ విడుదలైన రోజునే ఇండియాలో నంబర్‌వన్‌గా నిలవడం ఎంతో సంతోషానిచ్చింది. ప్రస్తుతం కూడా పోచర్‌ వెబ్‌ సిరీస్‌ టాప్‌లో ఉంది. సిరీస్‌ చూడని వారు త్వరగా చూడాలి’’ అని ప్రేక్షకుల్ని కోరింది.

pocher.jpg

కథ:
నిమిషా సజయన్‌ (మాల) తండ్రి చేసిన పాపానికి పరిహారంగా అడవిలో వన్యమృగాలను  రక్షించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఏనుగు దంతాల  కోసం 18 ఏనుగులను చంపేశారనే వార్త బయటకి రావడంతో మాల నివ్వెరపోతుంది. ఏనుగులను ఎవరు చంపుతున్నారు? ఏనుగు దంతాల రవాణా ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతోంది? మొత్తం ఈ నెట్‌ వర్క్‌ వెనుక ఉండి నడిపిస్తున్నదెవరు? అనేది తెలుసుకోవడం కోసం ఒక టీమ్‌ బరిలోకి దిగుతుంది. ఇందులో మాల కూడా భాగం అవుతుంది. ఈ కేసులో ముందుకు వెళుతున్న కొద్దీ వాళ్లకి తెలిసే నిజాలు ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే సిరీస్‌ చూడాల్సిందే. 

Updated Date - Feb 25 , 2024 | 04:31 PM