Ali Fazal: ఆ బాధతో నిద్రలేని రాత్రులు గడిపా!

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:20 PM

ఓటీటీలో మీర్జాపూర్‌ సిరీస్‌లు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే! లేటెస్ట్‌గా  స్ట్రీమింగ్ అయినా  ‘మీర్జాపూర్‌ 3’ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అందులో కీలక పాత్రలో నటించిన అలీ ఫజల్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు

ఓటీటీలో మీర్జాపూర్‌ సిరీస్‌లు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే! లేటెస్ట్‌గా  స్ట్రీమింగ్ అయినా  ‘మీర్జాపూర్‌ 3’ కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అందులో కీలక పాత్రలో నటించిన అలీ ఫజల్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి చెప్పుకొచ్చారు. అలాగే ‘మీర్జాపూర్‌’ సక్సెస్‌ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Aaaa.jpg
‘‘నటుడిని కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనొక బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ని. దేశం తరఫున ఆడాలని చిన్నతనంలోనే ఎన్నో కలలు కన్నా. స్కూల్‌ డేస్‌లో నాకొక ప్రమాదం జరిగింది. భుజానికి తీవ్ర గాయమైంది. విరామం తర్వాత తిరిగి బాస్కెట్‌బాల్‌ ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ గాయం వల్ల అది వీలుపడలేదు. ఆటలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పడంతో నటన వైపు అడుగులు వేశా. ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా. నిద్ర లేని రాత్రుళ్లు గడిపాను. మీర్జాపూర్‌’ చేసినప్పుడు అది వర్కౌట్‌ అవుతుందని, ఇంతటి ఘన విజయాన్ని అందుకుంటుందని మేము  ఊహించలేదు. ఆ సిరీస్‌ రిలీజయ్యాక కొన్నిరోజులపాటు ఎలాంటి టాక్‌ లేదు. వారం రోజుల తర్వాత షో ఊపందుకుంది. ఆనాటి నుంచి మేము వెనక్కి తిరిగి చూసుకోలేదు. విశేష ప్రేక్షకాదరణతో సూపర్‌హిట్‌ షోగా గుర్తింపు తెచ్చుకుంది.  విదేశాల్లో ఇలాంటి కంటెంట్‌తో ఎన్నో సినిమాలు, షోలు వస్తున్నాయి. అందువల్లనే దీనిలో యాక్ట్‌ చేయడానికి భయపడలేదు’’ అని అలీ అన్నారు. ఈ సిరీస్‌లో అలీ  గుడ్డూ భయ్యాగా నటించారు. ‘మీర్జాపూర్‌ 1, 2’ సిరీస్‌లకు కొనసాగింపుగా ఈ నెల5న ‘మీర్జాపూర్‌ 3’ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఓటీటీలో రికార్డు వ్యూస్‌ సాధించింది. ప్రైమ్‌ వీడియోలో విడుదలైన వారాంతంలో అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న సిరీస్‌గా నిలవడమే కాదు, గతంలో వచ్చిన ‘మీర్జాపూర్‌ 2’ రికార్డును సైతం బద్దలు కొట్టింది. 

Updated Date - Jul 13 , 2024 | 03:21 PM