Akshay Kumar: మాయాజాలం కోసం వేచిచూడండి

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:36 AM

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ (Akshay kumar) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి.


బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ (Akshay kumar) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఆయన నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాదికి కూడా ఆయన డైరీలో కాల్షీట్లు పూర్తయ్యాయి. 'కన్నప్ప', 'జాలీ ఎల్‌ఎల్‌బీ 3', 'వెల్‌కమ్‌ టు ది జంగిల్‌', 'హేరా ఫేరీ 3', 'శంకర' చిత్రాలతోపాటు మరో చిత్రంతో కామియో చేస్తున్నారు. తాజాగా ఆయన దర్శకుడు ప్రియదర్శన్‌తో ఓ హారర్‌ కామెడీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘భూత్‌ బంగ్లా’ (Bhoot Bungla) అనే పేరును ఖరారు చేశారు. బ్లాక్‌ మ్యాజిక్‌ ప్రధాన కథాంశంగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. సోమవారం అక్షయ్‌ పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. సినిమా ఫస్ట్‌ లుక్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘‘ఈ ఏడాది నా పుట్టిన రోజును ‘భూత్‌బంగ్లా’తో జరుపుకోవడం సంతోషంగా ఉంది. 14ఏళ్ల తర్వాత మళ్లీ ప్రియదర్శన్‌తో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ అద్భుతమైన ప్రయాణానికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. ‘భూత్‌ బంగ్లా’ చేసే మాయాజాలం కోసం వేచిచూడండి’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.  ఈ పోస్టర్‌లో భుజాలపై పిల్లిని కూర్చోబెట్టుకొని.. పాలు తాగుతూ కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నానాయన. 

Updated Date - Sep 10 , 2024 | 10:45 AM