Bigg Boss18: బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా గాడిద.. పెటా సీరియ‌స్

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:16 PM

తాజాగా హిందీ బిగ్‌బాస్ 18 ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ఓ గాడిద‌ను కూడా హౌజ్‌మెట్‌గా ప‌రిచ‌యం చేసి లోనికి పంపించారు. దీనిపై పెటా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ వార్త‌ బాగా వైర‌ల్ అవుతోంది.

bb18

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ,క‌న్న‌డ‌ నాట బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభ‌మై విజ‌య‌వంతంగా దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా హిందీ బిగ్‌బాస్ 18 (BiggBoss18) స‌ల్మాన్ ఖాన్ వ్యాఖ్యాత‌గా ఈ ఆదివారం (అక్టోబర్ 6) ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ఆ షోలో పాట్గొంటున్న ఒక్కొక్క‌రిని ప‌రిచ‌యం చేస్తూ హౌజ్‌లోకి పంపించారు. ఈ క్ర‌మంలో ఓ గాడిద‌ను కూడా హౌజ్‌మెట్‌గా ప‌రిచ‌యం చేసి లోనికి పంపించారు. ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ప‌రిణామంతో ప్రేక్ష‌కులు స్ట‌న్ అవ‌గా అస‌లు ఏం జ‌రుగుతుందో తేరుకుని తెలుసుకునే లోపు గాడిద‌ లోప‌లికి వెళ్ల‌డం కూడా జరిగిపోయింది.

Humorous-Twist.webp

ఇందుకు సంబంధించిన వీడియోను స‌ద‌రు కలర్స్ ఛానెల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయ‌గా వీడియో బాగా వైరల్ గా మారింది. దీంతో నెటిజ‌న్లు కొంత‌మంది క్రేజీగా కామెంట్లు చేయ‌గా మ‌రి కొంత‌మంది ఇదేం పోయేకాలం మ‌రి ఇంత‌కు తెగించార‌నే కామెంట్లు పెడుతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్‌ లోకి గాడిదను కూడా కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారా.. దానికి పేమెంట్‌ ఇస్తారా ? అంటూ త‌మ‌దైన శైలిలో పోస్టులు పెట్టి బిగ్‌బాస్‌ను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్క‌డ విష‌య‌మేంటంటే.. హిందీ బిగ్‌బాస్ 18లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన‌ అడ్వకేట్ గుణరత్న సదావర్తేకు తోడుగా ఆయ‌న పెంచుకునే గాడిద‌ను కూడా లోనికి పంపించారు. కానీ ఇత‌ర కంటెస్టెంట్స్ ఎలా రెస్పాండ్ అవుతార‌నే విష‌యం తెలియాల్సి ఉంది.


అయితే.. తాజాగా గాడిద‌ను బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకురావ‌డంపై జంతు హక్కుల పరిరక్షణ వేదిక ‘పెటా’ సీరియ‌స్ అయింది. ఈ నేప‌థ్యంలో సంబంధిత రియాల్టీ షోకు ఓ లెట‌ర్ రాసింది. జంతువులను ఇలాంటి షోల‌కు ఉపయోగించడం తీవ్ర‌మైన‌ నేరమని, జంతు ప్రేమికుల నుంచి కూడా చాలా అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నామ‌ని ఇలాంటి వాట‌టిని క్ష‌మించ‌లేమ‌ని వెంట‌నే బిగ్ బాస్ నుంచి జంతువులను దూరంగా ఉంచాల‌ని నిర్వాహకులను ఆ లేఖలో పెటా కోరింది.

Contestants.webp

అంతేగాక దేశంలో ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లున్న వ‌య్య‌క్తి స‌ల్మాన్ ఖాన్ నేడు ఎంతోమందికి ఆద‌ర్శ‌మ‌ని మ‌న సంతోషం కోసం జంతువుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌ని నిర్వాహ‌కుల‌కు చెప్పాల‌ని పెటా కోరింది. లైట్‌, సౌండ్‌కు గాడిద‌లు భ‌యప‌డ‌తాయ‌ని దానిని వెంట‌నే త‌మ‌కు అప్ప‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది. కాగా ఈలేఖ‌పై స‌ద‌రు రియాలిటి షో మేక‌ర్స్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

Updated Date - Oct 09 , 2024 | 03:19 PM