Kiran Rao: కొన్నిసార్లు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు..! 

ABN , Publish Date - Feb 11 , 2024 | 05:29 PM

నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్ (Aamir khan) నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ (Lal singh chadda). అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆమిర్‌ మాజీ భార్య కిరణ్‌రావ్‌ (Kiran rao) మాట్లాడుతూ

Kiran Rao: కొన్నిసార్లు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కదు..! 

నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్ (Aamir khan) నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ (Lal singh chadda). అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరాజయం పాలైంది. తాజాగా ఇంటర్వ్యూలో ఆమిర్‌ మాజీ భార్య కిరణ్‌రావ్‌ (Kiran rao) మాట్లాడుతూ  ‘‘కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. ఎంతో నిరుత్సాహానికి గురవుతాం. లాల్‌ సింగ్‌ చద్దా విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా పరాజయం ఆమిర్‌ ఖాన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆమిర్‌ను మాత్రమే కాదు మొత్తం చిత్ర బృందాన్ని ప్రభావితం చేసింది. ఇది ఆయన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. సినిమా, ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. కానీ ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఈ ఓటమిని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఫెయిల్యూర్‌  నుంచి మనం గుణపాఠాలు  నేర్చుకుంటాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యాక్షన్‌, క్రైమ్‌, కామెడీ, రొమాంటిక్‌ చిత్రాలు ఏవైనా ఒక ఫార్ములా ప్రకారం చేస్తుంటారు. చిత్రనిర్మాతలు కూడా ప్రేక్షకులకు నచ్చే కథలు చేసేందుకే ప్రయత్నిస్తుంటారు’’ అని అన్నారు.

 lal.jpeg

ఆమిర్‌ఖాన్‌ ప్రస్తుతం ‘సితారే జమీన్‌ పర్‌’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.  చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఏప్రిల్‌ చివరికి సినిమా పూర్తి చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది. ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలోనే ఈ చిత్రం రానుంది. ఆ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తే, ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని ఆమిర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్‌’  చిత్రాన్ని ఆమిర్‌ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కామెడీ డ్రామాగా రానున్న ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(టీఐఎఫ్‌ఎఫ్‌)లో ప్రదర్శించారు. మార్చిలో ఇది విడుదల కానుంది. 


Updated Date - Feb 11 , 2024 | 05:29 PM