12th Fail: 50వ స్థానంతో మరో ఘనత!
ABN , Publish Date - Feb 09 , 2024 | 05:11 PM
విధు వినోద్ చోప్రా (Vidhu Vinod chopra) దర్శకత్వంలో విక్రాంత్ మస్సే కీలక పాత్ర పోషించిన చిత్రం ‘12th ఫెయిల్’(12th Fail). చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
విధు వినోద్ చోప్రా (Vidhu Vinod chopra) దర్శకత్వంలో విక్రాంత్ మస్సే కీలక పాత్ర పోషించిన చిత్రం ‘12th ఫెయిల్’(12th Fail). చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌ను సొంతం చేసుకోవడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ) తాజాగా ప్రపంచవ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఈ సినిమా 50వ స్థానంలో నిలిచింది. అంతేకాదు.. టాప్ 50లో ఉన్న ఏకైక భారతీయ సినిమా కూడా ఇదే. ఇక ఐఎమ్‌డీబీలో (IMDB) అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం గతంలోనే రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ చిత్రాలను పక్కకునెట్టి 9.2 రేటింగ్‌తో ‘12th ఫెయిల్’ సంచలనం సృష్టించింది. దీనిపై దర్శకుడు స్పందిస్తూ ‘ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా చనిపోయినా పర్వాలేదనిపిస్తోంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
మనోజ్ కుమార్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 12వ తరగతి ఫెయిల్ అయిన యువకుడు.. ఐపీఎస్ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్ వేసింది. ఈ చిత్రంపై బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రం తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. విక్రాంత్ మస్సే అద్భుతంగా నటించారని.. పాత్రకు జీవం పోశారని చెప్పారు. ఈ చిత్రం ఎంతోమంది యువ నటుల్లో స్ఫూర్తి నింపిందంటూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.