VarunLav: ఇంతకీ ముహూర్తం ఎన్ని గంటలకి, గందరగోళంగా వున్న టైమింగ్స్

ABN , First Publish Date - 2023-11-01T16:34:55+05:30 IST

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం ముహూర్తం ఎన్ని గంటలకి అనేది కొంచెం గందరగోళంగానే వుంది. మంగళసూత్రం కట్టే టైము అని ఒకటి, వెడ్డింగ్ సెరిమనీ టైమింగ్ అని ఒకటి, వెడ్డింగ్ ముహూర్తం అని ఒక టైమింగ్ ఇలా పంపటంతో ఏ టైము కరెక్టు అని...

VarunLav: ఇంతకీ ముహూర్తం ఎన్ని గంటలకి, గందరగోళంగా వున్న టైమింగ్స్
Varun Tej and Lavana Tripathi with Mega family members

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కుమారుడు వరుణ్ తేజ్ (VarunTej), నటి లావణ్య త్రిపాఠి (LavanyaTripathi) ల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఈరోజు ఇటలీలో జరగబోతోంది. అయితే ఈ వివాహం ముహూర్తం టైమింగ్స్ లో మాత్రం చాలా గందరగోళం నెలకొనే పరిస్థితి ఏర్పడింది. వివాహం ఇటలీలో జరుగుతోంది, కానీ ముహూర్తం మాత్రం భారత కాలమానం ప్రకారం జరుగుతోంది ఏమో, అధికారిక ప్రకటనల్లో వివిధ రకాల టైమింగ్స్ ఉండటంతో అసలు ముహూర్తం ఎప్పుడు అనే గందరగోళం పరిస్థితి నెలకొంది. #VarunLav

టీము వరుణ్ తేజ్ సాంఘీక మాధ్యమం అయిన 'ఎక్స్' లో 2.18 నిముషాలకి వెడ్డింగ్ సెరిమోనీ అని కొన్ని ఫోటోలు పోస్ట్ చేసి పెట్టారు. అలాగే మీడియా గ్రూపుల్లో అధికారిక సమాచారం ఇచ్చేటప్పుడు మధ్యాహ్నం గం.2.48 నిముషాలకి మంగళసూత్రం (TyingtheKnot) కడతారు అని ప్రకటించారు.

varunlav6.jpg

ఇప్పుడు ఇంకొక వీడియో తాజాగా విడుదల చేశారు. అందులో కొన్ని ఫోటోస్, అక్కడ జరిగే హల్దీ ఫంక్షన్ పెట్టి వెడ్డింగ్ ముహూర్తం భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంకాలం గం.7.18 నిముషాలకి అని పంపించారు. అసలు ఏది కరెక్టు ముహూర్తం, ఇన్ని టైమింగ్స్ పెడుతూ ఉండటంతో ఏ టైమింగ్ కరెక్టు అనే గందరగోళ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. #MegaWedding

మెగా కుటుంబ సభ్యులు అందరూ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (RamCharan), అల్లు అర్జున్ (AlluArjun), వైష్ణవ తేజ్ (VaishnavTej), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej)తో సహా చాలామంది ఇప్పటికీ ఇటలీ చేరుకొని గత కొన్ని రోజులనుండీ అక్కడ జరిగే పెళ్లి సంబరాల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-11-01T16:34:55+05:30 IST