RamCharan: ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఫస్ట్ రామ్ చరణ్‌కి చెప్పగానే ఏమన్నాడో తెలుసా...
ABN , First Publish Date - 2023-06-15T19:01:20+05:30 IST
రామ్ చరణ్, ఉపాసనలు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక అత్యున్నతమైన జంటగా చెపుతున్నారు. వారి వివాహం అయి పదకొండు సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇద్దరూ పండంటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. డెలివరీ ఈనెలలోనే ఉండొచ్చు అని, అపోలో హాస్పిటల్ లో డెలివరీ కోసం ఒక స్పెషల్ రూమ్ తో సహా అంతా సిద్ధం చేశారని తెలిసింది.
పవర్ కపుల్ రామ్ చరణ్ (RamCharan), ఉపాసన (UpasanaKamineni) వివాహం అయి పదకొండు సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇద్దరూ తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఉపాసన ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది, అందుకని ఇద్దరూ ఆతృతగా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ముందుగా జులై లో అనుకున్నారు కానీ, ఇప్ప్పుడు ఈనెలలోనే ఎప్పుడైనా ఆమె బిడ్డకి జన్మ ఇవ్వొచ్చు అని తెలిసింది. #UpasanaBabyShower అపోలో హాస్పిటల్ లో ఆమెకోసం అంతా సిద్ధం చేశారని కూడా తెలిసింది. ఎందుకంటే ఉపాసన తన స్వంత ఆసుపత్రి అపోలో లో డెలివరీ చేయించుకోవడానికి సిద్ధం అయింది.
ఇదిలా ఉంటే ఉపాసన చాలా సార్లు ఆత్రుత, ఆవేశంతో ఏదైనా చెపితే, చరణ్ వెంటనే ముందు నిదానంగా కూర్చో అని చెప్పి సముదాయిస్తూ ఉంటాడట. అదే విషయాన్నీ ఉపాసన ఇప్పుడు చెపుతోంది. తాను ప్రెగ్నంట్ అన్న విషయం ముందుగా రామ్ చరణ్ కి చెప్పగానే, అతను వెంటనే ఏమి అనలేదుట. కంగారు పడకు, నిదానంగా వుండు అని చెప్పి టెస్టులు చేయించి కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు సెలెబ్రేట్ చేసుకున్నాడట. ఈ విషయం స్వయంగా ఉపాసన చెపుతోంది.
రామ్ ఆలా నిదానంగా వుండి, ఆమె ఎప్పుడైనా కంగారు పడినా, కొంచెం ఆతృతగా వున్నా దగ్గరుండి ఆమెకి ఏమి కాదని చెపుతూ సముదాయిస్తూ ఉంటాడుట. ఆ విషయమే రామ్ చరణ్ లో తనకి నచ్చే గొప్ప గుణం అని చెపుతుంది ఉపాసన. అప్పట్లో డెలివరీ జులైలో అని చెప్పారు కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ నెలలో ఉండొచ్చు అని అంటున్నారు.